నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌

May 27 2026 10:32 AM | Updated on May 27 2026 10:32 AM

నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌

కోదాడరూరల్‌ : పదే పదే నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని, అవసరమైతే వారిపై జిల్లా బహిష్కరణ వంటి చర్యలు తీసుకుంటామని ఎస్పీ కె.నరసింహ హెచ్చరించారు. మంగళవారం కోదాడ పట్టణంలోని కాశీనాథం కల్యాణ మండపంలో డివిజన్‌లో ఉన్న పాత నేరస్తులు, గంజాయి కేసుల్లో నిందితులు, సస్పెక్ట్‌ రౌడీ షీటర్స్‌తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నేరాలకు పాల్పడితే త్వరతగతిన శిక్షలు పడుతున్నాయని, క్షణికావేశానికి లోనై నేరాలు చేస్తే కుటుంబాన్ని వీధిన పడేసి జైలు జీవితం గడపాల్సి వస్తుందన్నారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని ప్రతి ఒక్కరూ సత్‌ప్రవర్తనతో మెలగాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, గంజాయి రవాణా, అసాంఘిక కార్యకలపాలకు పాల్పడే వారి వివరాలను పోలీలసుకు చేరవేయాలన్నారు. నేరాలకు పాల్పడకుండా సత్‌ప్రవర్తన కలిగిన వారిపై భవిష్యత్‌లో రౌడీ షీట్స్‌ ఎత్తి వేసే విషయాన్ని పరిశీస్తున్నామని చెప్పారు. కోదాడ మండలం గణపవరంలో జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. బక్రీద్‌ను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ రామారావు, సీఐలు శివశంకర్‌, చరమందరాజు, రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐలు పరమేష్‌, అజయ్‌కుమార్‌, నవీన్‌కుమార్‌, సుధీర్‌కుమార్‌, హనుమానాయక్‌, సతీష్‌రెడ్డి పాల్గొన్నారు.

అవసరమైతే జిల్లా బహిష్కరణ : ఎస్పీ

Advertisement
 
Advertisement
Advertisement