కోదాడ : బీఆర్‌ఎస్ సర్పంచ్‌లు ఉన్న గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేయడంలో వివక్ష చూపుతున్నారని, దాంతో గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టలేక సర్పంచ్‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం పలువురు సర్పంచ్‌లతో కలిసి ఆయన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మల్లయ్యయాదవ్ మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో మెజార్టీ గ్రామ పంచాయతీలు బీఆర్‌ఎస్ సర్పంచ్‌లు గెలవడంతో అధికార పార్టీ వారు ఆయా పంచాయతీలకు అభివృద్ధి నిధులు మంజూరు కాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై విచారణ నిర్వహించి వెంటనే బీఆర్‌ఎస్ సర్పంచ్‌లున్న పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ నాయకులు సుంకర అజయ్‌కుమార్, బట్టు శివాజీ, శీలం సైదులు, తొగరు రమేష్, జానకిరామాచారి, పల్లా నర్సిరెడ్డి, భూపాల్‌రెడ్డి, శంకర్‌నాయక్, ఉపేందర్, కందిబండ సత్యనారాయణ, సీతారాములు, పలువురు సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు ఉన్నారు.
కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ ఫిర్యాదు


