తిరుమలగిరి (తుంగతుర్తి) : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, మిల్లర్లు తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని తాటిపాముల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాలలో కాంటా వేసిన ధాన్యం బస్తాలను వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యం చేయవద్దని మిల్లర్లను సూచించారు. ఆయన వెంట డీఎస్‌ఓ మోహన్‌బాబు, సివిల్ సప్లై డీఎం శ్రీధర్‌రెడ్డి, తహసీల్దార్ హరిప్రసాద్, సర్పంచ్ బోయపల్లి కిషన్, పీఏసీఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్, సీఈఓ వినయ్‌కృష్ణారెడ్డి, ఏపీఎం లక్ష్మి ఉన్నారు.
బాలికలకు సైకిళ్ల పంపిణీ
మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సమాఖ్యల ద్వారా తిరుమలగిరిలో బాలికలకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. బాలికలకు సైకిళ్లను పంపిణీ చేసిన ఆయన వారికి పలు సూచనలు చేశారు. సైక్లింగ్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థినులను ప్రోత్సహించేందుకే సైకిళ్లను అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లాజర్, ఏపీఎం లక్ష్మి, డీటీ జాన్ మహ్మద్, సీసీ నాగయ్య, ఎంఎస్ అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు.
దిగుమతులు వేగవంతం చేయాలి
చివ్వెంల(సూర్యాపేట) : రైతులకు ఇబ్బందులు కలుగకుండా మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దుగుమతి చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. మండలంలోని బీబీగూడెం శివారులో ఉన్న శివదుర్గ రైస్‌మిల్‌ను ఆయన తనిఖీ చేశారు. దిగుమతులను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ జి.చంద్రశేఖర్, ఆర్‌ఐలు శ్రీనివాస్, శ్రావణి ఉన్నారు.
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్


