బౌద్ధక్షేత్రం కళాఖండాలు అద్భుతం | - | Sakshi
Sakshi News home page

బౌద్ధక్షేత్రం కళాఖండాలు అద్భుతం

May 26 2026 8:06 AM | Updated on May 26 2026 8:06 AM

నాగారం : మండలంలోని ఫణిగిరి బౌద్ధక్షేత్రం 2వేల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతనమైన గొప్ప చారిత్రక ప్రాంతమని, ఇక్కడి కళాఖండాలు అద్భుతమని ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన చరిత్ర, పురావస్తు శాఖ నిపుణులు విజిత్‌, పూజా, ఐసోన్‌, సౌరబ్‌ కొనియాడారు. సోమవారం ఫణిగిరి బౌద్ధక్షేత్రాన్ని, మ్యూజియాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫణిగిరి బౌద్ధక్షేత్రంపై లభించిన అరుదైన బౌద్ధ శిల్పసంపద, చారిత్రక ఆధారాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయన్నారు. అనంతరం ఫణిగిరి గుట్టపైన, మ్యూజియంలో ప్రాచీన బౌద్ధసంపదను పరిశీలించారు. ఈకా ఆర్తివింగ్‌ మ్యూజియం ప్రతినిధి ఇంద్రనీల్‌ మాట్లాడుతూ స్విట్జర్లాండ్‌లో ఉన్న డీబెర్గ్‌ మ్యూజియంలోని కళాఖండాల కంటే ఇవి అద్భుతంగా ఉన్నాయన్నారు. వారివెంట సిబ్బంది గట్టు వీరయ్య, కార్తీక్‌, యాకయ్య పాల్గొన్నారు.

ఢిల్లీ పురావస్తు శాఖ నిపుణులు

Advertisement
 
Advertisement
Advertisement