ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కరించాలి

May 26 2026 8:06 AM | Updated on May 26 2026 8:06 AM

భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా, డివిజన్‌ స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆనన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. పాత ప్రజావాణి పోర్టల్‌లో ఇంకా పరిష్కారం కాకుండా ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. కొత్తగా అందుతున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. అధికారులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. డివిజన్‌ స్థాయి ప్రజావాణికి అన్ని శాఖల డివిజనల్‌ అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బి.హరిసింగ్‌, డీఆర్‌డీఓ సన్యాసయ్య, హౌసింగ్‌ పీడీ సిద్ధార్థ్‌, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో మహిళా వారోత్సవాలు

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికా కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం మహిళా వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పోషకాహార ప్రదర్శనను కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ప్రారంభించి తిలకించారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ నరసింహారావు, సీడీపీఓలు కిరణ్మయి, శ్రీవాణి, సాయిలత, శ్రీజ, పారిజాత పార్వతి తదితరులు పాల్గొన్నారు.

మహిళా అభ్యున్నతికే ఇందిరా మహిళా శక్తి

భానుపురి (సూర్యాపేట) : మహిళా అభ్యున్నతికే ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం నిర్వహిస్తోందని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ తెలిపారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 8 వేల మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. మహిళలకు పంపిణీ చేసే ఇందిరమ్మ చీరల నూతన డిజైన్‌ (చిలకపచ్చ డిజైన్ను వర్చువల్‌గా ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్‌ మహిళా సంఘ సభ్యులతో సమీక్షించి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement
 
Advertisement
Advertisement