హెచ్‌ఐవీ పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచాలి | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీ పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచాలి

May 26 2026 8:00 AM | Updated on May 26 2026 8:00 AM

సూర్యాపేట టౌన్‌ : ఆసుపత్రిలో హెచ్‌ఐవీ పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచాలని తెలంగాణ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీ) డాక్టర్‌ జయలక్ష్మి అన్నారు. సోమవారం ఎయిడ్స్‌ సురక్ష కార్యక్రమం కింద సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ, ఎయిడ్స్‌, లెప్రసీ ప్రోగ్రామ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎల్‌ఎఫ్‌యూ కేసులను తగ్గించాలని, ప్రస్తుతం కొనసాగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా స్థిరమైన రోగులకు ఎంఎండీ అందించాలని సూచించారు. జిల్లాలో హెచ్‌ఐవీ నిర్ధారణ, చికిత్స, రోగుల ఫాలోఅప్‌ సేవలను మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కామేశ్వర్‌రావు, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ సిబ్బంది సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

సహజ కాన్పులకు ప్రాధాన్యమివ్వాలి

అర్వపల్లి : ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహజ కాన్పులకు ప్రాధాన్యమివ్వాలని తెలంగాణ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీ) డాక్టర్‌ జయలక్ష్మి కోరారు. అర్వపల్లిలోని పీహెచ్‌సీని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొబలైజేషన్‌ ఎయిడ్స్‌ సురక్ష కార్యక్రమంలో భాగంగా పీహెచ్‌సీలో సాధారణ, క్షయ, కుష్టువ్యాధిగ్రస్తులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. రిజిస్టర్లను, ల్యాబ్‌ను, ఫార్మసీని పరిశీలించారు. పీహెచ్‌సీలో జరుగుతున్న సహజ కాన్పులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పీఓ ప్రసిద్ధ, వైద్యాదికారి డాక్టర్‌ నగేష్‌నాయక్‌, ఉమ్మడి జిల్లా పీఓ సుధాకర్‌, సీహెచ్‌ఓ బిచ్చునాయక్‌, కామేశ్వరరావు, సూపర్‌వైజర్‌ లలిత, నర్సింగ్‌ ఆఫీసర్లు సునీత, మాధవి, కళమ్మ, టీబీ మండల నోడల్‌ పర్సన్‌ వీరయ్య పాల్గొన్నారు.

ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ

జేడీ డాక్టర్‌ జయలక్ష్మి

Advertisement
 
Advertisement
Advertisement