నకిరేకల్ : రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థతో పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకం ఏర్పడిందని రాష్ట్ర పోలీస్ ఫిర్యాదుల అథారిటీ సభ్యుడు వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. నకిరేకల్ పట్టణంలోని వైశ్య భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ద్వారా ప్రజలు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయని అన్నారు. పోలీసులంటే భయం అనే భావన పోయిందన్నారు. అనేక సందర్భాల్లో ప్రజలు తమకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా చెప్పుకునే అవకాశం కల్గిందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ విజయవంతం కావాలంటే ప్రజలు కూడా సహకరించాలని కోరారు. చట్టాన్ని గౌరవించడంతో పాటు సమాజ శాంతి, భద్రత కోసం పనిచేయడం మనందరి బాధ్యత అన్నారు. పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడంలో రాష్ట్ర పోలీస్ ఫిర్యాదుల అథారిటీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
రాష్ట్ర పోలీస్ ఫిర్యాదుల అథారిటీ సభ్యుడు వర్రె వెంకటేశ్వర్లు


