నకిరేకల్ : స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతూ గుండెపోటుతో మృతిచెందిన మాజీ సైనికుడు బెల్లి జనార్దన్(49) అంత్యక్రియలు సోమవారం ఆయన స్వగ్రామం నకిరేకల్ మండలం పాలెంలో సైనిక లాంఛనాలతో జరిగాయి. ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, జిల్లా 31 ఎన్‌సీసీ బెటాలియన్ సైనికులు జనార్దన్ భౌతికకాయంపై త్రివర్ణ పతాకం, పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులర్పించిన వారిలో రాష్ట్ర పోలీస్ ఫిర్యాదుల అథారిటీ సభ్యుడు వర్రె వెంకటేశ్వర్లు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, జిల్లా ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బండారి నర్సింహ, ఉపాధ్యక్షుడు కొమ్ము కోటేష్, సైనిక సంక్షేమ శాఖ అధికారులు భిక్షపతి, రాజు, దామోదర్, అంజాద్, నర్సింహ ఉన్నారు.


