సూర్యాపేటటౌన్ : చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటలోని అన్నాదురై నగర్‌కు చెందిన గుండె శ్రీకాంత్ పెయింటింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడిన శ్రీకాంత్ చోరీలకు పాల్పడుతున్నాడు. శనివారం రాత్రి సూర్యాపేటలోని సాయినగర్‌లో ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి 3 తులాల బంగారం, సుమారు 20 తులాల వెండి వస్తువులు, రూ.1000 నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం శ్రీకాంత్‌ను పట్టుకొని విచారించగా.. పలు ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు నిజం ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి బంగారం, వెండి, నగదు రికవరీ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.


