జీడీడీపీలో మెరుగు | - | Sakshi
Sakshi News home page

జీడీడీపీలో మెరుగు

Mar 22 2026 7:23 AM | Updated on Mar 22 2026 7:23 AM

సూర్యాపేట జిల్లాలో 38,113 పరిశ్రమలు సూర్యాపేట జీడీడీపీ రూ.38,865 కోట్లు తలసరి ఆదాయంలో యాదాద్రి ముందంజ యాదాద్రి జిల్లాలో అత్యధికంగా అటవీ ప్రాంతం అత్యధిక రేషన్‌ షాపులు నల్లగొండలోనే ఎస్సీ, ఎస్టీలకు తక్కువ భూములు వర్షపాతంలో వ్యత్యాసం

స్థూల జిల్లా దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో సూర్యాపేట 9వ స్థానం

2025 డిసెంబర్‌ 22వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా చూస్తే చిన్న తరహ పరిశ్రమల్లో నల్లగొండ నాలుగో స్థానంలో నిలిచింది. 2,38,879 చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలతో హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉండగా, 64,723 పరిశ్రమలతో నల్లగొండ నాలుగో స్థానంలో నిలిచింది. 38,113 పరిశ్రమలతో సూర్యాపేట 10వ స్థానంలో ఉండగా, 25,469 పరిశ్రమలతో యాదాద్రి భువనగిరి జిల్లా 17వ స్థానంలో ఉంది.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వర్గాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రై జెస్‌ (ఎంఎస్‌ఎంఈ) వద్ద, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఉద్యమ్‌ పోర్టల్‌లోనూ ఔత్సాహికులు వివిధ రకాల ఉత్పత్తి యూనిట్లను నెలకొల్పేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే–2026 వెల్లడించింది. పారిశ్రామికరంగంతో పాటు వివిధ రంగాల్లో ఉమ్మడి నల్లగొండ ఏ స్థానంలో ఉందన్న విషయాలను ఈ సర్వేలో ప్రభుత్వం వివరించింది.

స్థూల జిల్లా దేశీయోత్పత్తిలో (జీడీడీపీ) రాష్ట్రంలోనే నల్లగొండ ఐదో స్థానంలో ఉండగా, సూర్యాపేట 9వ స్థానంలో, యాదాద్రి జిల్లా 14వ స్థానంలో ఉన్నాయి. యాదాద్రి, సూర్యాపేటతో పోలిస్తే నల్లగొండ ముందువరుసలో ఉంది. నల్లగొండలో రూ.64,219 కోట్లు, సూర్యాపేటలో రూ.38,865 కోట్లు, యాదాద్రిలో రూ.30,924 కోట్లుగా జీడీడీపీ నమోదైంది.

తలసరి ఆదాయంలో నల్లగొండ, సూర్యాపేటతో పోల్చితే యాదాద్రి జిల్లా ముందంజలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తలసరి ఆదాయంలో యాదాద్రి జిల్లా 8వ స్థానంలో ఉండగా, నల్లగొండ జిల్లా 9వ స్థానంలో, సూర్యాపేట జిల్లా 14వ స్థానంలో ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో సగటున ప్రతి వ్యక్తి ఆదాయం రూ.3,35,264 కాగా, నల్లగొండలో రూ.3,30,216గా నమోదైంది. సూర్యాపేట జిల్లాలో 2,96,429గా నమోదైంది.

జిల్లాలోని భౌగోళిక ప్రాంతాల్లో అత్యధికంగా అటవీ విస్తీర్ణం రాష్ట్రంలోని ములుగు జిల్లాలోనే 64.64 శాతం ఉంది. ఇక యాదాద్రి జిల్లాలో 9.66 శాతం, నల్లగొండలో 9.57 శాతం, సూర్యాపేటలో 4.67 శాతం అటవీ విస్తీర్ణం ఉన్నట్లు ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వే –2023 వెల్లడించింది.

రాష్ట్రంలోనే అత్యధిక రేషన్‌ షాపులు నల్లగొండ జిల్లాలోనే ఉన్నాయి. ఇక్కడ 1051 రేషన్‌ షాపులు ఉండగా, 5,38,650 రేషన్‌ కార్డులు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 611 రేషన్‌ షాపులు ఉండగా, 3,69,926 కార్డులు ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 515 రేషన్‌ దుకాణాలు ఉండగా, 2,50,292 రేషన్‌ కార్డులు ఉన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం చేసే ఎస్సీ, ఎస్టీలకు ఉమ్మడి జిల్లాలోనే చాలా తక్కువ భూములు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో సగటున 5,30,742 మంది చేతుల్లో (ఇండివిడ్యువల్స్‌) 5,14,402.40 ఎకరాలు ఉండగా, సూర్యాపేటలో 2,86,897 మంది చేతుల్లో 2,64,521.06 ఎకరాల భూమి ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,33,535 మంది చేతుల్లో 2,32,250.67 ఎకరాలు ఉంది. అందులో నల్లగొండలో వ్యవసాయం చేసే 66,876 మంది ఎస్సీల చేతుల్లో 42,125 ఎకరాలు ఉండగా, 75,264 మంది ఎస్టీల చేతుల్లో 58,186 ఎకరాలే ఉంది. సూర్యాపేట జిల్లాలో 29,970 మంది వ్యవసాయం చేసే ఎస్సీల చేతుల్లో 16,159 ఎకరాలు ఉండగా, 43,713 మంది ఎస్టీల చేతుల్లో 31,968 ఎకరాల భూమి మాత్రమే ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 28,223 మంది ఎస్సీలకు 16,487 ఎకరాలు, 14,542 మంది ఎస్టీల చేతుల్లో 9542 ఎకరాలు మాత్రమే ఉంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు వర్షపాతంలో వ్యత్యాసం నమోదవుతోంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 76 శాతం వ్యత్యాసం నమోదైంది. నల్లగొండ జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 44 శాతం వ్యత్యాసం ఉండగా, సూర్యాపేటలో 30 శాతం వ్యత్యాసం నమోదైంది.

ఫ పరిశ్రమల్లో పది..

తలసరి ఆదాయంలో 14వ స్థానం

ఫ ఎస్సీ, ఎస్టీల చేతిలో ఉన్న భూమి తక్కువే

ఫ పరిశ్రమల ఏర్పాటుకు

ముందుకొస్తున్న ఔత్సాహికులు

సోషియో ఎకనామిక్‌ ఔట్‌లుక్‌–2026 వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement