కట్టెల పొయ్యితో కుస్తీ ! | - | Sakshi
Sakshi News home page

కట్టెల పొయ్యితో కుస్తీ !

Mar 22 2026 7:23 AM | Updated on Mar 22 2026 7:23 AM

కోదాడ : వంటగ్యాస్‌ కొరతతో కోదాడలోని ఓ హోటల్‌ యజమాని కట్టెల పొయ్యితో వంటకాలు చేయడం మొదలుపెట్టారు. గతంలో వంట చెరకు క్వింటా రూ.700 ఉండగా ప్రస్తుతం వీటి ధర కూడా వెయ్యి రూపాయలకు చేరింది.

శ్రీలక్ష్మీనరసింహుడికి విశేష పూజలు

మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లకు అభిషేకాలు, నిత్యహోమం జరిపించారు. శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి నిత్య కల్యాణం వైభవంగా చేశారు. ఆలయంలో నీరాజన మంత్రపుష్పాలతో మహా నివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈవో బి.జ్యోతి, ఆలయ అర్చకులు తూమాటి రామాచార్యులు, పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement