తుంగతుర్తి : మహాత్మా జ్యోతిబాఫూలే, జగ్జీవన్‌రామ్ చూపిన మార్గాలే మనకు దిక్సూచి అని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శనివారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యోతిబాఫూలే విగ్రహావిష్కరణ, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహనీయుల ఆలోచనలు ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని అన్నారు. సమాజంలో ఐక్యతను పెంపొందించాలని పిలుపునిచ్చారు. జ్యోతిబాఫూలే మహిళా విద్య, కులవ్యవస్థ నిర్మూలనలో కీలక పాత్ర పోషించగా, బాబూ జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. అనంతరం అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడోత్సవాలను, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న, గ్రామ సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, అరుంధతి యువజన సంఘం అధ్యక్షుడు చింతకుంట్ల పరమేష్, చింతకుంట్ల మిట్టల్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ కేతిరెడ్డి లతా విజయకుమార్ రెడ్డి, కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, పాశం అజయ్ కుమార్, గౌరవాధ్యక్షుడు చింతకుంట్ల వెంకన్న(బిల్డర్), మందుల నరేష్, చింతకుంట్ల పరమేష్ (బాబు), సభ్యులు మందుల పరమేష్, చింతకుంట్ల సైదులు, మాచర్ల ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు రేగటి రవి, సుంకరి జనార్దన్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే మందుల సామేల్


