వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి : డీఎంహెచ్‌ఓ | - | Sakshi
Sakshi News home page

వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి : డీఎంహెచ్‌ఓ

Mar 21 2026 5:27 AM | Updated on Mar 21 2026 5:27 AM

నాగార్జునసాగర్‌, మూసీకి తగ్గిన నిధులు

ఎస్పారెస్పీ కాలువల విస్తరణ

మునగాల : ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ పెండెం వెంకటరమణ అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా పోగ్రాం ఆఫీసర్‌ ప్రసీద్‌కుమార్‌, మండల వైద్యాధికారి రవీందర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్యశిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ శిబిరంలో 230మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి రవీందర్‌ తెలిపారు. వైద్య శిబిరాన్ని సర్పంచ్‌ నల్లపాటి ప్రమీల ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వి.సరిత, ఎంపీడీఓ కె.రమేష్‌దీనదయాళ్‌, సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌, ఉపసర్పంచ్‌ కాసర్ల వెంకట్‌, రిటైర్డ్‌ ఎంఈఓ ఓరుగంటి రవి, డాక్టర్‌ మణికుమారి, రేఖ, బడుగుల యశ్వంత్‌, రంజిత్‌ కుమార్‌, రాజు, రవీందర్‌, పుష్ప పాల్గొన్నారు.

సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి స్థల పరిశీలన

గరిడేపల్లి : మండలంలోని రాయినిగూడెం శివారులో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని సూర్యాపేట ఎస్‌ఈ శ్రీనివాస్‌ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రాయినిగూడెం, ముత్యాలనగర్‌, కాల్వపల్లి, సర్వారం, కాచవారిగూడెం, లింగగిరి గ్రామాల్లో లోవోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు 33/11కేవీ సబ్‌ స్టేషన్‌ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయన వెంట సర్పంచ్‌ గుండు రామాంజిగౌడ్‌, ఏఈ గన్న సాయికృష్ణ, పంచాయతీ కార్యదర్శి సునీత, ఏఎల్‌ఎం రాజు తదితరులు పాల్గొన్నారు.

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో వివిధ పనుల కోసం గతేడాది కంటే ఈసారి బడ్జెట్‌ను తగ్గించింది. గతేడాది బడ్జెట్‌లో రూ. 297.95 కోట్లను ఇచ్చిన ప్రభుత్వం ఈసారి దానిని రూ.195.85 కోట్లకే పరిమితం చేసింది. ఆ నిధులతో డ్యాం సంబంధిత, ప్రధాన పనులు, కాలువలు, డిస్ట్రిబ్యూటరీల పనులను చేపట్టాల్సి ఉంది. నాగార్జునసాగర్‌ కింద గతంలో మంజూరు చేసిన దాదాపు 15 ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులను బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. ఇక మూసీకి గతేడాది రూ. 50 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.30.15 కోట్లకే పరిమితం చేసింది.

జిల్లాలో ఉన్న శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పీ) స్టేజ్‌–2 కాలువల విస్తరణ, అభివృద్ధి పనుల్లో వేగం పుంజుకోనుంది. దీంతో జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించేలా చర్యలు చేపట్టనుంది. అందుకే ఈసారి బడ్జెట్‌లో ఈ పనులకు గతేడాది కంటే భారీగా పెంచింది. జిల్లాలో దీనికోసం గతేడాది రూ.34.01 కోట్లు మాత్రమే ఇచ్చిన ప్రభుత్వం ఈసారి రూ. 276.86 కోట్లు కేటాయించింది. దాదాపు రూ. 242.85 కోట్లు అదనంగా ఇచ్చింది. కాలువుల, డిస్ట్రిబ్యూటరీల కోసమే ఈ నిధులను కేటాయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement