సూర్యాపేటటౌన్ : రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో
శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలు పలించాలని, త్యాగా లకు, మతసామరస్యానికి ప్రతీక రంజాన్ అని పేర్కొన్నారు. తెలంగాణాలో కుల, మతాల ఐక్యతను పెంచిన ఘనత కేసీఆర్‌ది అని, ఆయన హయాంలోనే పండుగల ప్రాధాన్యత పెంచుకున్నామని, అన్ని మతాల ప్రధాన పండుగలను అధికారికంగా నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు.
ప్రమాద స్థలాల పరిశీలన
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ కె.నరసింహ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులను, తిరుమలగిరి క్రాస్ రోడ్డులో రోడ్డు ప్రమాద స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యత తీర్చేందుకు ఆపరేషన్ రోప్ అనే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. వాహనదారులు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. వ్యాపారులు రోడ్డు ఆక్రమించడం వల్ల ప్రజలు ప్రమాదాల బారిన పడతారని తెలిపారు. అరైవ్, అలైవ్ రోడ్డు భద్రత కార్యాచరణ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలను చైతన్యం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.


