పెన్షన్లకు మోక్షం.. | - | Sakshi
Sakshi News home page

పెన్షన్లకు మోక్షం..

Mar 21 2026 5:27 AM | Updated on Mar 21 2026 5:27 AM

పెన్షన్లకు మోక్షం..

చేయూత పెన్షన్‌ పథకం కింద.. సాధారణ పెన్షన్లు రూ.2వేలు, దివ్యాంగులకు రూ.4వేల

చొప్పున అందిస్తున్నారు. చివరిసారిగా 2022లో కొత్త పెన్షన్లను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లుగా పెన్షన్ల మంజూరు, పెన్షన్ల పెంపు లేకుండా పోయింది. ఈ బడ్జెట్‌లో పెన్షన్ల పెంపు రూ.500 వరకు ఉంటుందని ప్రచారం జరిగినా ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేదు. కానీ కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని నిర్ణయించగా.. జిల్లాలో సుమారుగా 15వేలకు మందికి లబ్ధి చేకూరనుంది.

ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంత కానుంది. ఈ బడ్జెట్‌లో గృహ నిర్మాణ శాఖకు రూ.7,430 కోట్లు కేటాయించింది. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల కోసమే దాదాపు రూ.5500 కోట్లు ఉన్నాయి. ఈ క్రమంలో జిల్లాలో వివిధ దశల్లో ఉన్న 5,400 ఇళ్లకు బిల్లుల చెల్లింపు జరగనుంది. నిర్మాణాలు వేగంగా పూర్తి కానున్నాయి. ఇక రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల ప్రస్తావన లేకపోవడంతో ఈ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు నిరాశ చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement