మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నిత్య కల్యాణం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు శ్రీస్వామి అమ్మవార్లకు అభిషేకం, ఎదుర్కోళ్ల మహోత్సవం, విష్వక్సేనారాదన, పుణ్యాహవచనం, రక్షాబంధనం నిర్వహించారు. మాంగల్యధారణ తంతు కనులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈవో బి.జ్యోతి, ఆలయ అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు పాల్గొన్నారు.


