యువత రాణిస్తేనే దేశాభివృద్ధి సాధ్యం
తిరుమలగిరి (తుంగతుర్తి) : యువత అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవాల్లో భాగంగా తిరుమలగిరిలో క్రికెట్ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో 60 శాతం యువత ఉన్నప్పటికీ క్రీడల్లో అనుకున్న స్థాయిలో రాణించడం లేదన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడా నైపుణ్యం వెలికితీసేందుకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడల కోసం కేంద్రం ప్రత్యేక బడ్జెట్ కేటాయించిందన్నారు. మద్యం, డ్రగ్స్‌కు బానిసలు కాకుండా సన్మార్గంలో నడవాలని సూచించారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఘనత మోదీకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, నాయకులు గంగిడి మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, మన్మథరెడ్డి, పాండురంగాచారి, వై.ధీన్‌దయాళ్, శ్రీనివాస్‌రెడ్డి, యాదగిరి, సాయిబాబా, బంగారి, సోమయ్య పాల్గొన్నారు.
రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్


