మట్టపల్లి క్షేత్రం అద్భుతం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రం అద్భుతంగా ఉందని, కృష్ణా నది తీరంలో ఎంతో ఆహ్లాదాన్నిస్తుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. శుక్రవారం ఆయన మఠంపల్లి మండలంలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తన సతీమణితో కలిసి సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి అర్చకులు పూర్ణకుభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గవర్నర్ మాట్లాడుతూ.. వసంత పంచమి రోజున మట్టపల్లి క్షేత్రాన్ని సందర్శించడంతో పాటు వ్యవసాయ కళాశాల, నవోదయ పాఠశాలకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా కృష్ణానది తీరంలో ఆలయం ఉండటం ఎంతో ఆహ్లాదకరంగా ఉందన్నారు. భారతదేశం వ్యవసాయయోగ్యంగా ఉందని, అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ జైజవాన్, జైకిసాన్, జైవిజ్ఞాన్, జై అనుసందాన్.. నినాదంతో రైతుల అభివృద్ధికి పాటుపడుతున్నారని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని పైలట్, ఫైటర్‌గా గవర్నర్ అభివర్ణించారు. అంతకుముందు గవర్నర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఆయిల్‌పామ్‌పై దృష్టి సారించండి : తుమ్మల
రాష్ట్రంలో వరి అధికంగా పండిస్తున్నారని, ఆయిల్‌పామ్‌పైనా దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు రైతులకు సూచించారు. రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగదు 10 లక్షల ఎకరాలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. నల్లగొండ, రంగారెడ్డి, నిజామాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలో మూడు వ్యవసాయ కళాశాలలను సీఎం, డిప్యూటీ సీఎం, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో మంజూరు చేశామన్నారు.
జిల్లా అభివృద్ధికి కృషి : అడ్లూరి లక్ష్మణ్
ఇంచార్జ్ మంత్రిగా సూర్యాపేట జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. గవర్నర్ పర్యటనతో మట్టపల్లి ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ వందన సమర్పణచేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు, రైతులకు యాంత్రీకరణ పరికరాల మంజూరు చెక్కులు పంపిణీ చేశారు.
స్టాళ్ల పరిశీలన
వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల, పౌరసరఫరాలు, వైద్య, విద్య శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను గవర్నర్ పరిశీలించారు. గవర్నర్ దంపతులకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ జానయ్య స్వాగతం పలికారు. గిరిజన నాయకులు గవర్నర్‌కు తలపాగాలు ధరింపజేశారు. సమావేశంలో ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఐఏఎస్ సురేంద్రమోహన్, అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఆర్‌డీఓ శిరీష, ఎస్పీ నరసింహ, మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు, ఏఎంసీ చైర్మన్ రాధికాదేశ్‌ముఖ్, సర్పంచ్ విజయశాంతి, శివారెడ్డి, మంజీనాయక్, వెంకటేశ్వర్లు, నాగన్న గౌడ్, మల్లికార్జున్‌రావు, కిషోర్‌రెడ్డి, లక్ష్మీవెంకటనారాయణ, అప్పారావు, ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి పాల్గొన్నారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
మట్టపల్లి క్షేత్రాన్ని సందర్శించిన
గవర్నర్ దంపతులు
వ్యవసాయ కళాశాల,
నవోదయ పాఠశాలకు శంకుస్థాపన
చుక్క నీటిని కూడా వదులుకోం : ఉత్తమ్
కృష్ణ, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటాను పూర్తిగా సాధిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కృష్ణమ్మ సాక్షిగా చెబుతున్నా.. చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదన్నారు. దేశంలోనే తెలంగాణ రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి సాధించిందన్నారు. వానాకాలం సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల కోట్ల మంది రైతుల నుంచి రూ.19వేల కోట్ల విలువ చేసే 71 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. సన్నవడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లించినట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి హుజూర్‌నగర్ వచ్చిన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు, రూ.200 కోట్లతో వ్యవసాయ కళాశాల, నవోదయ పాఠశాల మంజూరు చేసి మాట నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు.
మట్టపల్లి క్షేత్రం అద్భుతం
మట్టపల్లి క్షేత్రం అద్భుతం
మట్టపల్లి క్షేత్రం అద్భుతం


