మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా ఎం.రాంచందర్‌రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ కమిషనర్‌గా పని చేస్తున్న ఆయన బదిలీపై తిరుమలగిరి వచ్చారు. ఇక్కడ మున్సిపల్ కమిషనర్‌గా పని చేస్తున్న మున్వర్ అలీ ఎదులాపురం బదిలీ అయ్యారు.
అర్వపల్లి పీహెచ్‌సీ తనిఖీ
అర్వపల్లి: అర్వపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్యారోగ్యశాఖ జిల్లా పోగ్రాం అధికారి డాక్టర్ ప్రసిద్ధ శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, వైద్యసిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ బి.నగేష్‌నాయక్, డీపీఎంఓ ఆనంద్, సీహెచ్‌ఓ బిచ్చునాయక్, సూపర్‌వైజర్ లలిత, ఆశ కో–ఆర్డినేటర్ ఉపేందర్, నర్సింగ్ ఆఫీసర్లు సునిత, మాధవి, వీరయ్య, అనూష పాల్గొన్నారు.
విద్యార్థుల చదువుపై
దృష్టి సారించండి
సూర్యాపేటటౌన్ : పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని డీఐఈఓ భానునాయక్, ప్రత్యేకాధికారి భీమ్‌సింగ్ సూచించారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం తల్లిదండ్రులు, అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. అధ్యాపకులు చదువు బోధించడంతో పాటు క్రమశిక్షణను నేర్పాలని, పిల్లల మానసిక ప్రవర్తనను పరిశీలించిడంతో పాటు అధిక మార్కులు సాధించేలా తల్లిదండ్రులు చొరవ చూపాలన్నారు. గత ఏడాది కంటే ఈసంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పెరుమాళ్ల యాదయ్య, అధ్యాపకులు ప్రసాద్ వాసు, బసురున్నిస, గురవయ్య, కృష్ణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ
మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ


