మలి విడత బరిలో 456 మంది | - | Sakshi
Sakshi News home page

మలి విడత బరిలో 456 మంది

Dec 8 2025 8:16 AM | Updated on Dec 8 2025 8:16 AM

మలి విడత బరిలో 456 మంది

మలి విడత బరిలో 456 మంది

పూజలు చేసి ప్రచారం

సర్పంచ్‌ అభ్యర్థులుగా పోటీలో ఉన్న వారు ఆదివారం ఉదయమే ప్రత్యేక ప్రచార వాహనాలను సిద్ధం చేసుకొని దేవాలయాలు, చర్చీల వద్ద ప్రత్యే పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. రంగురంగుల కరపత్రాలను ముద్రించి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. యువకులు వాట్సప్‌ గ్రూప్‌ల్లో ఓటర్లకు సందేశాలను పంపుతూ తమ అభ్యర్థికి ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు.

కోదాడ : రెండో విడత ఎన్నికలు జరిగే ఎనిమిది మండలాల్లోని 181 పంచాయతీల్లో 23 పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 158 పంచాయతీలో 456 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. ఇక 181 పంచాయతీల్లో మొత్తం 1,628 వార్డులు ఉండగా వాటిలో 336 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1,292 వార్డుల్లో 2,790 మంది పోటీలో నిలిచారు. సర్పంచ్‌, వార్డు అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. దీంతో ఆదివారం నుంచి గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

పెన్‌పహాడ్‌లో అత్యధికం..

రెండో విడత ఎన్నికలు జరిగే 8 మండలాల్లో పెన్‌పహాహడ్‌ మండలంలోని 29 పంచాయతీల్లో 91మంది సర్పంచ్‌ అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. ఈ మండలంలో ఒక్క పంచాయతీ కూడా ఏకగ్రీవం కాలేదు. చిలుకూరు మండలంలోని 17 పంచాయతీల్లో ఐదు ఏకగ్రీవం కాగా 12 పంచాయతీల్లో అత్యల్పంగా 30మంది పోటీలో ఉన్నారు. అలాగే అనంతగిరిలో 54 మంది, కోదాడలో 45 మంది, నడిగూడెంలో 40 మంది, మోతెలో 63 మంది, మునగాలలో 58 మంది, చివ్వెంలలో 87మంది సర్పంచ్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

అసలెవరో.. రెబల్‌ ఎవరో!

ఎన్నికలు జరుగుతున్న పలు గ్రామాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో అసలెవరో.. రెబల్స్‌ ఎవరో తెలియని గందరగోళ పరిస్ధితి నెలకొంది. పలు గ్రామాల్లో పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థులు ఒకే పార్టీ కండువాలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితి అధికార పార్టీలో ఎక్కువగా కనిపిస్తోంది. మునగాల మండలం ముకుందాపురంలో ఇద్దరు కాంగ్రెస్‌ కండువాలతో ప్రచారం చేస్తున్నారు. ఇదే విధమైన పరిస్థితి చిలుకూరు మండలం బేతవోలు, కోదాడ మండలం గణపవరం, గుడిబండ గ్రామాల్లోనూ నెలకొంది. ఆయా గ్రామాల్లో నాయకులు కూడా రెండు గ్రూపులుగా విడిపోయి కొందరు ఒకరికి.. మరికొందరు ఇంకొక్కరికి మద్దతు నిస్తూ ప్రచారం సాగిస్తుండడంతో పంచాయతీ రాజకీయం వేడెక్కింది. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఉద్యోగులు తెర వెనుక ఉండి తమ బంధువులను ఎన్నికల బరిలో దింపారు. కోదాడ మండలం గుడిబండలో నీటిపారుదలశాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తన భార్యను పోటీగా నిలపగా, ఆమైపె పోలీస్‌ శాఖలో సీఐగా పనిచేస్తున్న ఒకరు తనతల్లిని పోటీకి దింపారు. ముకుందాపురంలో ఇద్దరు పోలీస్‌ అధికారులు సర్పంచ్‌ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం.

ఫ 158 గ్రామాల్లో తేలిన

సర్పంచ్‌ అభ్యర్థుల లెక్క

ఫ మొత్తం 181 పంచాయతీలకు

23 ఏకగ్రీవం

ఫ ఎనిమిది మండలాల్లో

336 వార్డులు కూడా..

ఫ 1,292 వార్డులకు

2,790 మంది పోటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement