ఏఎస్ రావు జ్ఞాపకార్థమే టాలెంట్ టెస్ట్
సూర్యాపేట టౌన్ : ఈసీఐఎల్ వ్యవస్థాపకుడు ఏఎస్ రావు జ్ఞాపకార్థమే ఆదివారం సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో 35వ సైన్స్ టాలెంట్ సెర్చ్ టెస్ట్ నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. పరీక్ష అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ టెస్ట్ నిర్వహిస్తున్నామని, ఈ సారి జిల్లా నుంచి 1000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదుతోపాటు 25 మందికి మెరిట్ సర్టిఫికెట్లు అందజేస్తున్నామని పేర్కొన్నారు. సహకరించిన కళాశాల యాజమాన్యానికి, ప్రిన్సిపాల్ డాక్టర్ వి.వెంకటేశులుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వేణుగోపాలరావు, కేకేబీఏ.శర్మ, వైవీ.సుబ్బారావు, ఆర్.కృష్ణమూర్తి, కె.సత్యనారాయణ, పి.రాజు పాల్గొన్నారు.


