నేడు సాగర్‌కు విదేశీ ప్రతినిధులు
నాగార్జునసాగర్ : తూర్పు, పశ్చిమ ఆసియా దేశాల బౌద్ధ ప్రతినిధులు సోమవారం నాగార్జునసాగర్‌ను సందర్శించనున్నారు. వీరికి మూడు రోజులపాటు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఏర్పాట్లు చేసింది. విజయవిహార్ ప్రాంగణం, బుద్ధవనం పరిసరాలు, లాంచీ స్టేషన్ దారి తదితర ప్రాంతాలు ముస్తాబు చేశారు. ప్రతినిధులు ముందుగా హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి విజయవిహార్‌కు రానున్నారు. డ్యామ్‌ను సందర్శించి లాంచీలో జలాశయంలో విహరించనున్నారు.
విమానాల రద్దుతో అయోమయం
కొన్ని అంతర్జాతీయ విమానాలు రద్దు కావడంతో ఏ దేశాల నుంచి ఎంతమంది ప్రతినిధులు వస్తారన్న వివరాలు పర్యాటక శాఖ వద్ద స్పష్టంగా లేవు. విదేశీ అతిథులు హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాతే తుది టూర్ షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి.


