హుజూర్‌నగర్ : రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య అన్నారు. గురువారం హుజూర్‌నగర్‌లో నిర్వహించిన సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒకటో తారీఖున వేతనాలు పడడం తప్ప ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదన్నారు. హెల్త్ కార్డులు, పెండింగ్ డీఏలు, పీఆర్‌సీపై ప్రభుత్వం నోరు విప్పడం లేదన్నారు. ఎంతో ఆశతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే నిరాశ తప్ప మరొకటి లేదన్నారు. ఇటీవల జేఏసీ పునరుద్ధరణ జరిగినప్పటికీ ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 11 మండలాలకు కార్యవర్గాలు ఎన్నుకున్నట్లు చెప్పారు. ఈ నెల చివరి వరకు జిల్లా కార్యవర్గ ఎన్నిక నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్. సుదర్శన్‌రెడ్డి, రాంబాబు, సంఘ నాయకులు హమీద్‌ఖాన్, వీరారెడ్డి, పూర్ణచంద్రారెడ్డి, అంకతి అప్పయ్య, మొహినుద్దీన్, రఘు, జూలకంటి నర్సిరెడ్డి, చంద్రశేఖర్, ధర్మూరి వెంకటేశ్వర్లు, ఎంఎస్‌ఎన్ రాజు పాల్గొన్నారు.
రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీతారామయ్య