ఆండాళ్‌ అమ్మవారికి ఊంజలి సేవ | - | Sakshi
Sakshi News home page

ఆండాళ్‌ అమ్మవారికి ఊంజలి సేవ

Aug 2 2025 6:06 AM | Updated on Aug 2 2025 6:06 AM

ఆండాళ్‌ అమ్మవారికి  ఊంజలి సేవ

ఆండాళ్‌ అమ్మవారికి ఊంజలి సేవ

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆండాళ్‌ అమ్మవారికి శుక్రవారం ఊంజలి సేవను పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. శ్రావణమాసం రెండో శుక్రవారం సాయంత్రం వేళ అమ్మవారిని బంగారు ఆభరణాలు, వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సమయంలో మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టించి ఊంజలి సేవ చేపట్టారు. ఇక ఆలయంలో నిత్య పూజలు యథావిధిగా కొనసాగాయి.

బైక్‌ అదుపుతప్పి

యువకుడి మృతి

మరో ఇద్దరికి గాయాలు

డిండి: బైక్‌ అదుపుతప్పి యువకుడు మృతిచెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం రాత్రి డిండి మండలం బొల్లనపల్లి గ్రామ స్టేజీ సమీపంలో జరిగింది. శుక్రవారం ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన లక్కు విజయభాస్కర్‌రెడ్డి(18), ఎం. సిద్దార్ధరెడ్డి, ప్రకాష్‌రెడ్డి గురువారం శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకుని రాత్రి బైక్‌పై ముగ్గురు కలిసి నాగార్జునసాగర్‌కు వెళ్తున్నారు. మార్గమధ్యలో డిండి మండలం బొల్లనపల్లి గ్రామ స్టేజీ సమీపంలో వీరి బైక్‌ అదుపుతప్పడంతో మధ్యలో కూర్చున్న విజయభాస్కర్‌రెడ్డి రోడ్డుపై పడి తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన సిద్దార్ధరెడ్డి, ప్రకాష్‌రెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం దేవరకొండకు తరలించారు. శుక్రవారం దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం విజయభాస్కర్‌రెడ్డి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొనిఽ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement