మెళియాపుట్టి: రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్లా బొజ్జిరెడ్డి సోమవారం మండలంలో పర్యటించారు. మండల కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో ఆయన సభ నిర్వహించారు. మందస, మెళియాపుట్టి, పాతపట్నం, మందస, నందిగాం, టెక్కలి, కొత్తూరు, హిరమండలం తదితర మండలాల్లోని గ్రా మాలకు చెందిన గిరిజనులు వారి సమస్యలపై వినతులు అందించారు. వినతిపత్రాలపై ఆయన స్పందిస్తూ.. పరిష్కారం చేస్తామన్నారు. బొజ్జి రెడ్డి వస్తుండగా దీనబంధుపురం కూడలి వద్ద పలువురు గిరిజనులు గ్రానైట్ ఫ్యాక్టరీల వల్ల ఇబ్బంది పడుతున్నామని ఆయనకు తెలిపారు. అయితే కారు దిగకుండా దూరంగా చూసి వెనుదిరుగుతున్న సమయంలో గ్రానైట్ వ్యర్థాల వల్ల కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని చూడాలని వారు కోరారు. దానికి ఆయన బదులిస్తూ వినతి పత్రాల రూపంలో రాసివ్వాలని, సమయం లేదని చెప్పి వెనుదిరిగారు.


