ఎవరెవరు ఏమన్నారంటే..
శ్రీకాకుళం
30న చలో మూలపేట విజయవంతం చేయండి
మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026
దాడిచేద్దాం ముప్పేట
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): దశాబ్దాలుగా సిక్కోలు కల గంటున్న మూలపేట పోర్టును సాకారం చేసిన ఘనత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందని, పోర్టు నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చి రూ.3400కోట్లు నిధులు మంజూరు చేసి సుమారు 74 శాతం పనులు పూర్తిచేశారని వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు. మిగిలిన పనులు పూర్తి చేస్తే ఆ క్రెడిట్ ఎక్కడ జగన్‌మోహన్‌రెడ్డి ఖాతాలో పడిపోతుందనే అక్కసుతో టీడీపీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు పనులు చేపట్టకుండా తాత్సారం చేస్తున్నార ని వారు మండిపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన సోమవారం జిల్లా కేంద్రంలో ‘మన మూలపేటకు పోదాం పదండి’ పేరిట సన్నాహక సమావేశం జరిగింది. ఈ నెల 30న చలో మూలపేటను విజయవంతం చేయాలని వారు కోరారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నర్తు రామారావు, పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే అదీప్‌రాజు, తూర్పుకాపు, కళింగవైశ్య, వెలమ కుల రాష్ట్ర బీసీ విభాగం నాయకులు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, అంబటి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్రకార్యదర్శి కేవీజీ సత్యనారాయణ, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంవీ స్వరూప్, రాష్ట్రకార్యదర్శి ఎన్ని ధనుంజయరావు, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్, పార్టీ మహిళావిభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు ఎంవీ పద్మావతి, ఎస్‌ఈసీ మెంబర్లు చల్ల శ్రీనివాసరావు, గొండు కృష్ణమూర్తి, ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, తమ్మినేని చిరంజీవినాగ్, కరిమి రాజేశ్వరరావు, పిన్నింటి సాయి, ఉలాల భారతిదివ్య, చల్ల రవికుమార్, పొన్నాడ రుషి, ముంజేటి కృష్ణమూర్తి, మార్పు పృధ్వి, ముత్తా విజయ్‌కుమార్, ప్రత్తి అన్వేష్, గంట్యాడ రమేష్, బొడ్డేపల్లి రమేష్, బూడి అనురాధ, గేదెల పురుషోత్తం, మండవల్లి రవి, కోణార్క్ శ్రీను, సనపల నారాయణరావు, బుక్కూరు ఉమామహేశ్వరరావు, రౌతు శంకరరావు, తంగుడు నాగేశ్వరరావు, అంధవరపు రమేష్, డాక్టర్ నిమ్మన దాస్, చిట్టి జనార్ధనరావు, మూకళ్ల తాతబాబు, పీస శ్రీహరి, బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు అశోక్‌చక్రవర్తి, గద్దిబోయిన కృష్ణయాదవ్, టి.కామేశ్వరిలతో పాటు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అసమర్థ ప్రభుత్వమిది
శ్రీకాకుళం ఉద్యమాల పురిటి గడ్డ. మూలపేట పోర్టు నిర్మాణానికి వైఎస్సార్‌సీపీ శ్రీకారం చుడితే మిగిలిన పనులు పూర్తిచేయడం కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వం టీడీపీది. అప్పట్లో ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు శంకుస్థాపనకు హెలికాప్టర్‌లో నేను వచ్చి తిరిగి వెళ్తుండగా వైఎస్ జగన్ ఒక్కసారి హెలికాప్టర్ వెనక్కి తిప్పి మూలపేట పోర్టు పనులు చూసి వెళ్దామన్నారు. ఈ జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడులు ఉన్నా ఒక్క అభివృద్ధి పని చేయలేదు.
– బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి
రామన్న అచ్చెన్నలకు అడిగే దమ్ము లేదు
పోర్టు నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు తెచ్చి పనులన్నీ దాదాపు పూర్తి చేస్తే ఆ మిగిలిన పని పూర్తి చేయడం టీడీపీ నేతలకు చేత కావడం లేదు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులకు జిల్లా అభివృద్ధికి నిధులు అడిగే దమ్ము లేదు. అరసవల్లి ఇంద్రపుష్కరిణి పనులకు మేం శంకుస్థాపన చేస్తే..శిలాఫలకాలపై పేర్లు మార్చి మళ్లీ అవే పనులకు కొబ్బరికాయలు కొట్టారు. ఒడిశా, ఆంధ్రాలో కూటమి పార్టీలే ఉన్నా నేరడిపై చర్చే జరగడం లేదు. బస్టాప్‌లు, సోలార్ లైట్లపై పేర్లు రాసుకుంటే అభివృద్ధి కాదు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే ప్రాజెక్టులు కట్టాలి. ఈ ఏడాది బడ్జెట్‌లో వంశధార, నేరడిలకు పైసా వెచ్చించలేదు. మూలపేట పోర్టు నిర్మాణంలో నాటి మంత్రి సీదిరి కీలక పాత్ర పోషించారు. రానున్న రోజుల్లో వంశధార ప్రాజెక్టు, బుడగట్లపాలెం, కలెక్టరేట్‌లను సందర్శించి పనులు చేయాలని ప్రశ్నిద్దాం. ఏం చేయకపోయినా జనం ఓట్లు వేస్తున్నారనేదే టీడీపీ నేతల ధీమా.
– ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి
సన్నాహక సమావేశంలో పార్టీనేతల పిలుపు
ఉద్యమాల పురిటి గడ్డ శ్రీకాకుళం:
బూడి ముత్యాలనాయుడు
ఏం చేయకపోయినా ఓట్లు వేస్తున్నారనే టీడీపీ ధీమా: ధర్మాన ప్రసాదరావు
రాబోయే ఎన్నికల్లో మూలపేట పోర్టుని అస్త్రంగా వాడాలి: ధర్మాన కృష్ణదాస్
పోర్టుతో ప్రపంచంతో కనెక్టివిటీ:
కుంభా రవిబాబు
అపర భగీరథుడు జగన్‌మోహన్‌రెడ్డి: సీదిరి అప్పలరాజు
ఇదే మన అస్త్రం
వలసల నివారణకు, ఉద్యో గ, ఉపాధి అవకాశాలకు మూలపేట పోర్టు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వైఎస్ జగన్ ఈ పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుడితే.. కూటమి పాలకులు దాన్ని పూర్తిచేయకపోవడం అన్యాయం. రాబోయే ఎన్నికల్లో మూలపేట పోర్టుని అస్త్రంగా వాడుకుని వైఎస్సార్‌సీపీ విజయానికి బాటలు వేద్దాం. పది వేల మందితో పోర్టును సందర్శిద్దాం.
– ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు


