కుటుంబం సామాజిక బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

కుటుంబం సామాజిక బహిష్కరణ

Mar 24 2026 6:52 AM | Updated on Mar 24 2026 6:52 AM

రణస్థలం: రణస్థలం మండలంలోని కొండములగాం గ్రామంలో బైరెడ్డి తవుడు కుటుంబ సభ్యులను సామాజిక బహిష్కరణ చేస్తున్నట్లు ఆదివారం ఉదయం గ్రామ పెద్దలు తీర్మానం చేయడం, ఆ కుటుంబానికి ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదని రాత్రి సమయంలో దండోరా వేయడం మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఘటనను ఖండిస్తూ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ రాష్ట్ర ప్రెసిడెంట్‌ కె.గౌరినాయుడు, బైరెడ్డి కుటుంబ సభ్యులు జేఆర్‌ పోలీసులకు, డిప్యూటీ ఎంపీడీఓలకు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వారు తెలిపిన వివరాల మేరకు..

కొండములగాం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్‌ 57/15లో 10 సెంట్లు భూమి ఉంది. ఆ భూ మిపై అన్ని పత్రాలు ఉన్నాయి. కోర్టు తమకు అనుకూలంగా స్టే ఇచ్చిందని, అయినా దీనిపై తమ కుటుంబానికి ముడిపెట్టి తమను సామాజిక బహిష్కరణ చేయడం ఎంత వరకు న్యాయ మని బాధితులు ప్రశ్నించారు. దీనిపై దండోరా వేయించడం బాధ కలుగుతోందన్నారు. బంధు వుల వద్ద తలెత్తుకోలేకపోతున్నామని తెలిపారు. గ్రామ పెద్దలపై తగు చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement