సోంపేట: బారువ గ్రామంలోని బస్టాండ్ వద్ద గల ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివా రం రాత్రి హుండీని గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి నగదు దొంగిలించారు. కమిటీ సభ్యులు ఆదివారం ఉదయం వెళ్లే సరికి హుండీ ధ్వంసమై ఉండడాన్ని గమనించారు. కమిటీ సభ్యుడు ఎస్.ఆదినారాయణ బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదినారాయణ ఫిర్యా దు మేరకు ఎస్‌ఐ హరిబాబు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కార్గో ఎయిర్‌పోర్టుకు
వ్యతిరేకంగా నిరసన
మందస: బిడిమి గ్రామంలో జుత్తు జగన్నాయకులు స్మారక చిహ్నం వద్ద ఆదివారం కార్గో ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు కొందరు మాట్లాడుతూ కొందరు వ్యక్తులు శ్రీకాకుళం కలెక్టరేట్‌కు వెళ్లి భూములు ఇవ్వడానికి ఈ ప్రాంతం ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రచారం చేస్తున్నారని, అది పూర్తిగా అసత్యమని తేల్చి చెప్పారు. ఈ ప్రాంతంలో సెంటు భూమి కూడా ఇవ్వబోమని తేల్చి చె ప్పారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషకు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పామన్నారు. కేంద్ర మంత్రికి ఉద్దానం సమస్యలపై పట్టింపు లేదన్నారు. కార్యక్రమంలో తెప్పల అప్పారావు, కృష్ణమూర్తి, గంటు రామస్వామి, దున్న రామారా వు, తామాడ లక్ష్మీ నారాయణ, దున్న సురేష్, మర్ల సంతోష్, లబ్బ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పాతపట్నం: రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గ్రీవెన్స్ సెల్ నిర్వహించనున్నారని రాష్ట్ర ఎస్సీ సెల్ సెక్రటరీ సీమ రామకృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారు సమస్యలపై వినతులు అందజేయవచ్చన్నారు. సాయంత్రం మూడు గంటలకు జిల్లా అధికారులతో సమీక్ష ఉంటుందన్నారు.


