శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక, భూసమస్యలకు సంబంధించిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను సోమవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీల నమోదు, స్థితిగతులకు సంబంధించి 1100 నంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగం భక్తుల వసతి గృహం అందుబాటులోకి వచ్చింది. సుదూర ప్రాంతాల భక్తులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ ఈఓ కె.ఏడుకొండలు ఆదివారం తెలిపారు.


