ఫోజులు కొత్తవి | - | Sakshi
Sakshi News home page

ఫోజులు కొత్తవి

Mar 23 2026 9:14 AM | Updated on Mar 23 2026 9:14 AM

పనులు పాతవి..

ఫొటో చూడండి. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన అరసవల్లి ఇంద్ర పుష్కరిణి పునః నిర్మాణ పనులకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌ కలిపి మరోసారి శంకుస్థాపన చేసిన దృఽశ్యమిది. నాడు మంజూరైన నిధులనే వినియోగిస్తూ దానికి ప్రసాద్‌ స్కీమ్‌ రూ. 58కోట్లతో అభివృద్ధి పనులని కలరింగ్‌ ఇచ్చారు.

ఫొటో చూడండి. 2023 డిసెంబర్‌ 20వ తేదీన రూ.4కోట్లతో అరసవల్లి ఇంద్ర పుష్కరిణి పునః నిర్మాణ పనులకు నాటి రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేసిన దృశ్యమిది. నిధులు కూడా మంజూరయ్యాయి. పుష్కరిణిలో ఉన్న నీరు అంతా తీసేసి క్లీన్‌ చేశారు. అప్పటికి కాంట్రాక్టర్‌ ఖరారు కాలేదు. పనులు చేసే లోపు ఎన్నికల కోడ్‌ వచ్చేసింది. పనులు ముందుకు సాగలేదు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అభివృద్ధి అనే పదానికి చంద్రబాబు ప్రభుత్వం వింత అర్థం చెబుతోంది. గత ప్రభుత్వంలో శంకుస్థాపన జరిగిన పనులకు మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రసాద్‌ స్కీమ్‌ కింద అరసవల్లి అభివృద్ధి చేస్తామని అనేక శాశ్వత కట్టడాలను కూల్చేశారు. ఆ పనులకు ఇప్పటివరకు అతీగతి లేదు. ఇప్పటికే రెండు రథసప్తమి వేడుకలు అయిపోయాయి. కూల్చేసిన కట్టడా లు ఎక్కడికక్కడే ఉన్నాయి. ప్రసాద్‌ స్కీమ్‌ మంజూరుకు నోచుకోలేదు. ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడేమో రూ. 58కోట్లతో ప్రసా ద్‌ స్కీమ్‌ ద్వారా అరసవల్లి క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పి.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేసిన ఇంద్ర పుష్కరిణి పనులకే మళ్లీ కింజరాపు బాబాయ్‌, అబ్బాయ్‌లు శంకుస్థాపన చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

రథ సప్తమి వేడుకలు రాష్ట్ర పండగగా గుర్తించి, ప్రజల సొమ్ముతో సంబరాలు చేసి, వివిధ కార్యక్రమాలతో సోకులు చేశారే తప్ప ప్రభుత్వం నుంచి ఒక్క పైసా తీసుకురాలేదు. అట్టహాసం పేరుతో విపరీతమైన పబ్లిసిటీ చేసి ఈ సారి రథసప్తమి దర్శనాల సమయంలో భక్తులను తీవ్ర ఇబ్బందులకు గు రి చేశారు. ప్రత్యేకంగా నిధులు తెచ్చి అభివృద్ధి చేశారా అంటే అదీ లేదు. ఒక్క పైసా విడుదల చేయలేదు. కార్పొరేషన్‌లో అప్పటికే ఉన్న నిధులను, సుడా నిధులను వాడేసి అభివృద్ధి పనుల ముసుగులో కావాల్సిన కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చారు. ఆ పనులు ఎంత నాసిరకంగా ఉన్నాయో వాటిని ప్రస్తుతం చూస్తే ఎవరికై నా అర్థమవుతుంది. కార్పొరేషన్‌ సొమ్మును దుబారా చేయడం తప్ప పనులకు సార్థకత ఉండటం లేదు. వీరు చేసిన పనికి కార్పొరేషన్‌ ఆర్థిక ఊబిలో కూరుకుపోయిందని, నిధులు ఖాళీ అయిపోయాయని, కొత్త పనులు చేపట్టడానికి ఏమీ లేదని ఓ అధికారి ఉన్నతాధికారులకు ఏకంగా నివేదిక ఇచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడేమో రూ. 58కోట్లతో ప్రసాద్‌ స్కీమ్‌ కింద అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని కొత్త పబ్లిసిటీకి తెరలేపారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌ మాదిరి ప్రజల్ని మభ్య పెట్టేడమే లక్ష్యంగా అడుగులు వేస్తు న్న పరిస్థితులు ఉన్నాయి. నాలుగు సార్లు ముఖ్య మంత్రిగా చేసిన చంద్రబాబు ఈ జిల్లాకు చేసిన మేలంటూ ఏమీ లేదు. వైఎస్సార్‌ చేపట్టిన వంశధార ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేదు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో చేపట్టిన మూలపేట పోర్టు, బుడగట్లపాలెం పిషింగ్‌ హార్బర్‌, వంశధార ఎత్తిపోతల పథకం, కిడ్నీ రీసెర్చ్‌ ఆస్పత్రి, ఉద్దానం మంచినీటి పథకం, గత ప్రభుత్వంలో మంజూరైన విద్యా సంస్థలకు పూర్తి సౌకర్యాలు, వసతులు, పనుల పూర్తిపై ఇప్పటివరకు దృష్టి పెట్టలేదు. ఇప్పటికే అధికారం వచ్చి రెండేళ్లు కావస్తోంది. మిగతా మూడేళ్లలో ఏం చేస్తారో క్లారిటీ లేదు. దానికి అరసవల్లి ఆలయం అభివృద్ధి పనుల పేరుతో కూల్చేసిన కట్టడాల చిత్రాలే నిలువెత్తు సాక్ష్యం.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో చేసిన

శంకుస్థాపనలకు మళ్లీ శంకుస్థాపనలు

కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నదిదే

కొత్తగా మంజూరు కాని నిధులు

పాత వాటితో సోకులు

అరసవల్లి ఆలయ అభివృద్ధి పేరుతో కొత్తగా హడావుడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement