రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Mar 23 2026 9:14 AM | Updated on Mar 23 2026 9:14 AM

అతడి భార్యకు, పాపకు తీవ్రగాయాలు

రణస్థలం: లావేరు మండలంలోని బుడుమూరు జాతీ య రహదారిపై ఆదివారం బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. లావేరు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. స్కూటీపై కె.రమే ష్‌(32) తన భార్య సుజాత, రెండేళ్ల కుమార్తె ధాతిశ్రీతో శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో బుడుమూరు దగ్గరకు వస్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో గాయపడిన రమేష్‌ను స్థానికులు హుటాహుటిన 108 వాహనంపై శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయారు. భార్య సుజాత, పాప ధాతిశ్రీకి బలమైన గాయాలు కావడంతో శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రమేష్‌ స్వగ్రామం విజయనగరం జిల్లాలోని దాకమర్రి. గార మండలం నిజామాబాద్‌లో ఉన్న అత్తవారింటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై లావేరు ఎస్‌ఐ కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement