‘ఇచ్ఛాపురం ఎమ్మెల్యే ప్రకటన సరికాదు’ | - | Sakshi
Sakshi News home page

‘ఇచ్ఛాపురం ఎమ్మెల్యే ప్రకటన సరికాదు’

Mar 23 2026 9:14 AM | Updated on Mar 23 2026 9:14 AM

పలాస: ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ఇటీవల బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో కలపాల నే ప్రకటనను వెనక్కి తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి వీల్లేదని గిరిజన సంఘాల జేఏసీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పలాసలో ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా జేఏ సీ అధ్యక్షుడు సవర రాంబాబు, ప్రధాన కార్యదర్శి గురాడి అప్పన్న, గిరిజన సంఘం నాయకుడు సవర జగన్నాయకులు, జేఏసీ చీఫ్‌ అడ్వైజర్‌ వాబ యోగి మాట్లాడుతూ బెందాళం అశోక్‌ స్పీకరు రఘురామకృష్ణంరాజును కలిసి బెంతు ఒరియాలను ఎస్టీల్లో చేర్చాలని కోరడం సరికాదన్నారు. గతంలో ఈ విషయంపై జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారుల ఏర్పాటు చేసిన కమిషన్‌ నివేదికలను చూసి ఎమ్మెల్యేలు ముందుకు వెళ్లాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement