‘నంది విగ్రహం ధ్వంసం దారుణం’ | - | Sakshi
Sakshi News home page

‘నంది విగ్రహం ధ్వంసం దారుణం’

Mar 23 2026 9:14 AM | Updated on Mar 23 2026 9:14 AM

సోంపేట: బారువ కోటిలింగేశ్వర స్వామి దేవాలయం ఆవరణలోని ఉమామహేశ్వర స్వామి దేవాలయంలోని నంది విగ్రహాన్ని దొంగిలించి ధ్వంసం చేయ డం దారుణమని వైఎస్సార్‌సీపీ ఇచ్ఛాపురం సమన్వయకర్త సాడి శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి అన్నారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి కోటిలింగేశ్వర స్వామి దేవాలయాన్ని, ఉమామహేశ్వర స్వా మి దేవాలయాన్ని సందర్శించారు. అనంతరం దేవాలయంలో నంది విగ్రహం దొంగిలించిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. నిందితులను పట్టుకుని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దేవాలయాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు. బారువ మేజర్‌ పంచాయతీ పరిధిలోని బారువ పేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వారిని ఆదుకోవాలని, జగనన్న కాలనీని అభివృద్ధి చేయాలని కోరా రు. డిగ్రీ కళాశాల సమీపంలో శిథిలావస్థలో ఉన్న మంచినీటి ట్యాంకును కూల్చాలని అధికారులను కోరారు. ఆయనతో పాటు పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్‌, వైస్‌ ఎంపీపీ గురాల శ్రీను, బారువ, పలాసపురం సర్పంచ్‌లు యర్ర రజని, తడక జోగారావు, ఎంపీటీసీ తామాడ పద్మ, దేవాలయ అర్చకులు భువనేశ్వర్‌ పాణిగ్రాహి, పార్టీ నాయకులు నర్తు బాను, తామాడ బుజ్జి, దున్న మాదవరావు, కర్రి సత్యం, తెప్పల ధర్మారావు, తిరుపతిరెడ్డి, అమర లోకనాథం, శంకర్‌, బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement