● జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ
శ్రీకాకుళం: జిల్లా అభివృద్ధి పథకాల అమలులో వేగం పెంచాలని, ప్రభుత్వ నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయ అధికారులను ఆదేశించారు. ఆదివా రం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన 1, 2, 4, 7వ స్థాయీ సంఘాల సమావేశాలు సుదీర్ఘంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు సూచించిన పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసి, నివేదికలను సిద్ధం చేయాలన్నారు. ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జరిగిన పనులపై విచారణ జరపాలన్నారు. అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులను సహించేది లేదు. సమావేశాల్లో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, జెడ్పీ సీఈఓ డి.సత్యనారాయణ, వివిధ మండలాల జెడ్పీటీసీ సభ్యులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


