ప్రసంగిస్తున్న ముఫ్తీ జియావుర్ రహమాన్
రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నెల రోజుల ఉపవాస దీక్షలను విరమించారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్పుకుని పేదలకు దానధర్మాలు చేశారు. జిల్లా కేంద్రంలోని చారిత్రక జామియా మసీదు వద్ద రంజాన్ సందర్భంగా సందడి వాతావరణం కనిపించింది. –శ్రీకాకుళం కల్చరల్ /
సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం


