రూ.26.96 కోట్లతో మడ్డువలస ఫేజ్‌–2 పనులు | - | Sakshi
Sakshi News home page

రూ.26.96 కోట్లతో మడ్డువలస ఫేజ్‌–2 పనులు

Mar 21 2026 4:51 AM | Updated on Mar 21 2026 4:51 AM

జి.సిగడాం : మడ్డువలస ప్రాజెక్ట్‌ కాలువ పనుల కోసం ఫేజ్‌–2 కింద రూ.26 కోట్ల 90 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని ప్రాజెక్ట్‌ ఎస్‌ఈ పొన్నాడ సుధాకరరావు తెలిపారు. శుక్రవారం దేవరవలస వద్ద చేపడుతున్న కాలువ పనులను ఎస్‌ఈ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌కు రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పనులు జరుగుతున్న సమయంలో ప్రజలు, రైతులు సహకరించాలన్నారు. ఇప్పటికే అవసరమైన రైతులకు కాలువ ద్వారా సాగునీరు విడుదల చేస్తున్నామని చెప్పారు. ఫేజ్‌–2 పనులు పూర్తయితే ప్రతిసెంటు భూమికీ సాగునీరు అందుతుందన్నారు. ఈయనతోపాటు ఈఈ బోర గోవిందరావు, డీఈఈలు పి.రవికుమార్‌, ఎ.రమేష్‌, జేఈఈలు బి.కోటేశ్వరరావు, రాజశేఖర్‌, సిబ్బంది ఉన్నారు.

దేవరవలస వద్ద పనులను పరిశీలిస్తున్న ఎస్‌ఈ

సుధాకరరావు, ఈఈ గోవిందరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement