శ్రీనివాస్ కల్యాణ్ (488వ ర్యాంకు)
జి.సాయిగణేష్
(31వ ర్యాంకు)
ఇంటూరు ఉమేష్‌చంద్ర (77వ ర్యాంకు)
పూడి అభిషేక్
(246వ ర్యాంకు)
ఎచ్చెర్ల : గేట్–2026 ఫలితాల్లో ర్యాంకులు కై వసం చేసుకున్న విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకోవాలని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం డైరెక్టర్ ప్రొఫెసర్ సండ్ర అమరేంద్రకుమార్ తెలిపారు. జి.సాయిగణేష్ (ఈసీఈ) 31వ ర్యాంకు, ఇంటూరి ఉమేష్‌చంద్ర (సీఎస్‌ఈ) 77వ ర్యాంకు, మరో 20 మంది విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చాయని చెప్పారు.కార్యక్రమంలో డీన్ శివరామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
– సంతబొమ్మాళి: కోటపాడు పంచాయతీ కాశీపురం గ్రామానికి చెందిన పూడి అభిషేక్‌కు గేట్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రతిభ కనబరిచాడు. ఆలిండియా స్థాయిలో 246వ ర్యాంకు సాధించాడు. అభిషేక్ తండ్రి రాంబాబు రైతు కాగా, తల్లి సునీత గృహిణి. తాడేపల్లిగూడెంలో ఇంజినీరింగ్ చదివి గేట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల కుటుంబసభ్యులు, గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
జి.సిగడాం: మండల కేంద్రం జి.సిగడాంకు చెందిన పుప్పాల శ్రీనివాస్ కల్యాణ్ గేట్‌లో ఆలిండియా స్థాయిలో 488వ ర్యాంకు సాధించాడు. తండ్రి గౌరీ ప్రసాద్ ఆటో డ్రైవర్, తల్లి దివ్యకుమారి గృహిణి. శ్రీనివాస్ కల్యాణ్ బీటెక్ పూర్తి చేసుకుని ఇంటి వద్దనే చదువుకుంటూ గేట్‌లో మంచి ర్యాంకు సాధించడం పట్ల కుటుంబసభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


