మందస/వజ్రపుకొత్తూరు రూరల్: జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం గ్రామానికి చెందిన లావేటి మనోజ్(20) గురువారం రాత్రి హరిపురం నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వస్తుండగా కొర్రాయి గేటు సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో మనోజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మనోజ్ కార్పెంటర్‌గా పని చేసేవాడు. తండ్రి సూర్యనారాయణ, తల్లి గౌరి, సోదరుడు వినయ్ ఉన్నారు. మనోజ్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. మందస ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతూ..
రణస్థలం : వరిశాం సమీపంలో ఈ నెల 16న ఓ ప్రైవేటు పాఠశాల బస్సును ఢీకొట్టిన ప్రమాదంలో లంక మోహన్ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి కారి సీతయ్య గాయపడి శ్రీకాకుళంలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. పరిస్థితి విషమించడంతో సీతయ్య(27) శుక్రవారం ఉదయం మరణించినట్లు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు.


