రైలు హాల్ట్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రైలు హాల్ట్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Mar 21 2026 4:51 AM | Updated on Mar 21 2026 4:51 AM

టెక్కలి/పాతపట్నం/మందస: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రాపురం రైల్వే హాల్ట్‌ వద్ద విశాఖ–గుణుపూర్‌ ప్యాసింజర్‌ రైలు హాల్ట్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్రమంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి కె.అచ్చెన్నాయుడు కోరారు. శుక్రవారం ప్యాసింజర్‌ రైలు హాల్టింగ్‌ను ప్రారంభించారు. పాతపట్నం రైల్వే స్టేషన్‌లో రూర్కెలా–గుణుపూర్‌ రాజారాణి ఎక్స్‌ప్రెస్‌ రైలు హాల్టును, మందస రైల్వే స్టేషన్‌లో బ్రహ్మపురం–విశాఖ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు హాల్ట్‌ను కేంద్రమంత్రి, పాతపట్నం, పర్లాకిమిడి ఎమ్మెల్యేలు మామిడి గోవిందరావు, రూపెష్‌ పాణిగ్రహీ, రైల్వే అధికారులు ప్రారంభించారు. కార్యక్రమంలో వాల్తేరు, ఖుర్ధా రైల్వే డివిజన్‌ డీఆర్‌ఎంలు లలిత్‌, సునీల్‌, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement