న్యూస్‌రీల్
–8లో
నువ్వలరేవులో రామయ్య వైభోగం
● సాగర తీరంలో సీతారాముల
పరిణయానికి సర్వం సిద్ధం
● నువ్వలరేవులో రేపటి నుంచి
శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం
● తరతరాలుగా ప్రత్యేకతను
చాటుకుంటున్న మత్స్యకారులు
● ఏప్రిల్ 2 వరకు వేడుకల నిర్వహణ
నేటి ఇంగ్లిష్ పరీక్ష వాయిదా
శ్రీకాకుళం: రంజాన్ సందర్భంగా ప్రభుత్వం శనివారం సెలవు ప్రకటించిన నేపథ్యంలో పదో తరగతి, ఓపెన్ స్కూల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు డీఈఓ పి.రవిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 21న జరగాల్సిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీకి, ఓపెన్ స్కూల్ గణితం, భారతీయ సంస్కృతి పరీక్షలను మార్చి 30వ తేదీకి వాయిదా వేసినట్లు చెప్పారు. గతంలో కేటాయించిన ఇన్విజిలేటర్లు, సిబ్బంది అందరూ మారిన తేదీల్లో యధావిధిగా విధులకు హాజరుకావాలని స్పష్టం చేశారు.
మొక్కజొన్న కొనుగోలులో దళారులదే రాజ్యంగా మారింది. మద్దతు ధర రూ.1600కు పడిపోవడంతో రైతులు ఆందోళన
చెందుతున్నారు.
శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026
ఎన్నో సరదాలు
గుండెలతో పలకరింపులు
‘ఫజర్’ నమాజు నుంచి
ఆక్రీ జుమ్మా దాకా
నెలవంక పొడుపు నుంచి
రంజాన్ ‘ఈద్’ దాకా..
రంజాన్ మాసం
వన్నెల రంగుల దీపం
మనిషి మనిషిని కలిస్తే
ఆయుష్షు పెరిగే సంతోషం
22 నుంచి
ఇంటర్మీడియెట్ స్పాట్
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ఈ నెల 22 నుంచి మొదలుకానుందని జిల్లా ఆర్‌ఐఓ రేగ సురేష్‌కుమార్ తెలిపారు. వాస్తవానికి ఈ నెల 21 నుంచి స్పాట్ మొదలుకానుండగా రంజాన్ సెలవును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20కి బదులుగా 21వ తేదీకి మార్పు చేసిందని గుర్తుచేశారు. ఇప్పటికే సంస్కృతం పేపర్ల వాల్యుయేషన్ జరుగుతోందన్నారు. మిగిలిన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని చెప్పారు.
29న బాలుర క్రికెట్ జట్టు ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లా అండర్–19 బాలుర క్రికెట్ జట్టు ఎంపికలను ఈ నెల 29న జరగనున్నాయని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు పుల్లెల శాస్త్రి, కార్యదర్శి హసన్‌రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ శుక్రవారం తెలిపారు. చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ క్రీడామైదానం వేదికగా ఉదయం 8 గంటల నుంచి ఎంపికలు మొదలవుతాయని పేర్కొన్నారు. 2007 సెప్టెంబర్ ఒకటి తర్వాత జన్మించిన వారు అర్హులని స్పష్టంచేశారు. ఆసక్తి, అర్హత కలిగిన క్రీడాకారులు జనన ధృవీకరణ పత్రం, ఆధార్‌కార్డు, తెలుపు యూనిఫాం, స్పోర్ట్స్ కిట్‌తో హాజరుకావాలని కోరారు.
దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్‌కు 7 అర్జీలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: దివ్యాంగుల అర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. కలెక్టర్, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ బి.శైలజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏడు దరఖాస్తులు స్వీకరించారు. అందులో దివ్యాంగ పింఛన్ల మంజూరు కోరుతూ 1, బ్యాటరీ వాహనం కోరుతూ 1, సదరం సర్టిఫికెట్ కోరుతూ 1, ఆర్టీసీ బస్ రిజర్వేషన్ సమస్యపై 1, ఉద్యోగ ఉపాధి కల్పించమని కోరుతూ 3 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జనారణ్యంలో జింక మృతి
పలాస : అభయారణ్యం నుంచి జనారణ్యంలోకి వచ్చిన జింక రోడ్డు ప్రమాదంలో శుక్రవారం మృతి చెందింది. పలాస మండలం శాసనాం జాతీయ రహదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ వన్యప్రాణి మృత్యువాత పడింది. సమాచారం అందుకున్న వైల్డ్ లైఫ్‌కు చెందిన ఓంకార్ త్యాడి జింక మృతదేహాన్ని పలాస ప్రభుత్వ పశువుల ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. అనంతరం పూడ్చిపెట్టారు. కాగా, గ్రావెల్ మాఫియా కంకర కోసం అటవీ ప్రాంతాల సమీపంలోని కొండలను తొలిచేస్తున్నారు. అక్కడ రణగొణ ధ్వనుల వల్ల అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనారణ్యంలోకి వచ్చి ఈ విధంగా మృత్యువాత పడుతున్నాయి. అటవీశాఖ అధికారులు స్పందించి వన్యప్రాణుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ, జంతు ప్రేమికులు కోరుతున్నారు.
వర్షంతో ఉపశమనం
శ్రీకాకుళం/కొత్తూరు : జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతకు గురైన ప్రజానీకానికి వర్షం కొంత ఉపశమనమిచ్చింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రెండు రోజులుగా వాతావరణ శాఖ చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు జిల్లావ్యాప్తంగా వర్షం పడింది. కొత్తూరు, కర్లెమ్మ, పారాపురం, మహసింగి తదితర గ్రామాల్లో వర్షం కురవడంతో రైతుల్లో ఆనందం నెలకొంది.
ఐకమత్యంతో ఉత్సవాలు..
తరతరాలుగా వస్తున్న శ్రీరామనవమి ఉత్సవాలు ఐకమత్యంతో జరుపుకుంటున్నాం. మాఇంటి ఇలవేల్పుగా బృందావతి అమ్మవారిని కొలుసుకుంటూ మాకు ఆదర్శ దైవంగా నిలిచిన శ్రీరాముడు, సీతమ్మలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ఏటా వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. – మువ్వల పూర్ణచంద్రరావు, సర్పంచ్
నువ్వలరేవు, వజ్రపుకొత్తూరు మండలం
ఆచారాలకు పెద్దపీట..
తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తాం. వలస కూలీలు ఎక్కడ ఉన్న స్వగ్రామానికి చేరుకుని ఉత్సవాలలో భాగస్వామ్యం అవుతారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పెద్దలు, పూజారులు, యువకులు సహకారంతో ఉత్సవాలు జరుపుకుంటాం.
– బి.వెంకటేష్, మాజీ ఎంపీటీసీ, నువ్వలరేవు, వజ్రపుకొత్తూరు మండలం
వజ్రపుకొత్తూరు రూరల్:
కోదండరాముడి కల్యాణోత్సవానికి జిల్లాలోనే అతిపెద్ద మత్స్యకార గ్రామమైన నువ్వలరేవు(లక్ష్మిదేవిపేట) ముస్తాబవుతోంది. తరతరాలుగా వస్తున్న కుల కట్టుబాట్లు, సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తూ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు గ్రామస్తులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు ఏప్రిల్ 2 వరకు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి.
అంతటా ప్రత్యేకమే..
స్వగ్రామానికి వలస జీవులు..
తాము ఎక్కడ ఉన్నా గ్రామ దేవత బృందావతి అమ్మవారి చల్లన దీవెనలు, సీతారాముల కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయని గ్రామస్తుల విశ్వాసం. అందుకే భారీ వ్యయంతో పెద్ద పండగగా కల్యాణోత్సవం జరుపుకుంటారు. ఈ వేడుకను తిలకించేందుకు వలస జీవులంతా స్వగ్రామానికి చేరుకుంటారు.
ఊరంతా వెలుగు..
శ్రీరామ నవమి ఉత్సవాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలతో ఊరంతా విద్యుత్ వెలుగులతో విరజిమ్ముతుంది. ఉత్సవాలు తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది జనం తరలివస్తుంటారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల చొరవతో గ్రామస్తులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
స్పీకర్ శుభాకాంక్షలు
రంజాన్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ముస్లింలందరికీ శుభాకాంక్షలు. రంజాన్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
– తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్
30న మూలపేట పోర్టు సందర్శన
పోలాకి: జిల్లా ప్రజల చిరకాల స్వప్నం మూలపేట పోర్టును ఈ నెల 30న వైఎస్సార్‌సీపీ ఉన్నత స్థాయి అధికార బృందం సందర్శించనున్న నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ క్షేత్రస్థాయిలో సన్నాహక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మబగాంలో పాతపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి నేతృత్వంలో ముఖ్యనాయకులతో కృష్ణదాస్ సమావేశమాయ్యరు. కార్యక్రమానికి సంబంధించి దిశానిర్దేశం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రారంభించి దాదాపు 85 శాతం పనులు పూర్తిచేసిన తరువాత కూడా మిగిలిన పనులు పూర్తిచేయకుండా కూటమి ప్రభుత్వం పోర్టు పట్ల వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ముఖచిత్రం మార్చేయాలనే ధ్యేయంతో, వలసల నివారణ కోసం తీసుకున్న ఈ నిర్ణయం క్రెడిట్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చెందుతుందనే దురుద్దేశంతోనే పోర్టుపై కూటమి నాయకులు కినుక వహిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలతో కలసి పోర్టును సందర్శించి ప్రభుత్వ తీరును ప్రజలముందు ఉంచాలని చెప్పారు. రెడ్డి శాంతి మాట్లాడుతూ పోర్టులో కనీసం ట్రయల్ రన్ వేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రాంతీయయాత్ర ద్వారా జగన్ హయాంలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత పనుల జాప్యాన్ని ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు.
హిరమండలం:
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో త్వరలో ప్రత్యేకాధికారుల పాలన అమలుకానుంది. ప్రస్తుతం సర్పంచ్‌ల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుండగా, నిబంధనల ప్రకారం ఆ లోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే బీసీ రిజర్వేషన్ల ఖరారు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక వంటి సాంకేతిక, న్యాయ పరమైన అంశాల కారణంగా పంచాయతీ ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల జరిగే వరకు గ్రామ పంచాయతీల పరిపాలనను ప్రత్యేకాధికారులకు అప్పగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దీంతో ఆశావహులు మూగబోతున్నారు. జిల్లాలో 912 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఇతర మండల స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించే అవకాశం ఉంది. అధికారుల కొరత ఉన్న ప్రాంతాల్లో ఒక అధికారికి రెండు, మూడు పంచాయతీల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం.
ఆలస్యానికి ప్రధాన కారణాలు...
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ముందు బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి రావాల్సి ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం (ట్రిపుల్ టెస్ట్) రిజర్వేషన్ల అమలుకు ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ 45 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది. అనంతరం రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ప్రారంభించడానికి మరో రెండు నెలల సమయం పట్టే అవకాశముంది. ఇక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మారనున్నారు. ఈ ప్రక్రియల్నీ పూర్తయ్యే సరికి పంచాయతీ ఎన్నికలు జూన్ తర్వాతే జరిగే అవకాశం ఉందని రాజకీయవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక కూటమిలోని నాయకులు, కార్యకర్తలను సంతృప్తి పరిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికలు జరిగి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పగ్గాలు చేపడితే నాయకులు, కార్యకర్తలను వందశాతం సంతృప్తి పరచలేమని, ఏడాది పాటు ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రణాళికలు రచిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరో వైపు ప్రజల్లో అసంతృప్తిని సైతం అంచనా వేసి, ఎన్నికల ను దూరం చేస్తోందని వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రత్యేక అధికారుల జాబితాపై కసరత్తు
గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా నియమించేందుకు జిల్లా అధికారులు ఇప్పటికే జాబితా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తహసీల్దార్లు, మండల పరిషత్ అధికారులు, పంచాయతీ రాజ్ సహా య ఇంజినీర్లు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, మండల విద్యాధికారులు, వ్యవసాయ అధికారులు, పశు వైద్యాధికారులు,ఆరోగ్యశాఖ సూపర్‌వైజర్లు, ఉద్యా న శాఖ అధికారులు, ఉప తహసీల్దార్లు తదితర శా ఖ అధికారుల పేర్లను పరిశీలిస్తున్నారు. ప్రత్యేకా ధికారులుగా గెజిటెడ్ అధికారులనే నియమించాల ని ప్రభుత్వం స్పష్టం చేయడంతో టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్ల పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు సమాచారం. అయితే అధికారుల కొరత ఏర్పడితే చిన్న పంచాయతీల్లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, మండల పరిషత్ సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు, హెడ్మాస్టర్లను కూడా ప్రత్యేక అధికారులుగా నియమించే అవకాశం ఉంది. మండల కేంద్రాలకు జిల్లాస్థాయి అధికారులను ప్రధాన గ్రామ పంచాయతీలకు తహసీల్దార్లను పెద్ద జనాభాగల పంచాయతీలకు ఎంపీడీఓలను ప్రత్యేకాధికారులుగా నియమించే ప్రతిపాదనలు ఉన్నాయి. అవసరమైతే ఒక అధి కారికి రెండు లేదా మూడు పంచాయతీల బాధ్యతలు అప్పగించే అవకాశముందని తెలుస్తోంది.
ఏప్రిల్ 2తో సర్పంచ్‌ల పదవీ కాలం ముగింపు
జూన్ తర్వాతే పంచాయతీ ఎన్నికలకు అవకాశాలు
అప్పటివరకు ప్రత్యేక అధికారుల చేతిలో గ్రామ పాలన
ఇది నిజమేనా..?
పంచాయతీ ఎన్నికల నిర్వహణ క్రమంపై కూటమి పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. సాధారణంగా పార్టీ గుర్తులు లేకుండా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో వర్గపోరుకు దారి తీసే అవకా శం ఉందని నాయకులు భావిస్తున్నారు. ఈ ప్రభా వం తర్వాత జరిగే మండల పరిషత్, జిల్లా పరిషత్ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికలపై పడే ప్రమాదం ఉందని జిల్లా నాయకులు అంటున్నారు. అందుకే ముందుగా పార్టీ గుర్తులతో జరిగే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తే కూటమి శ్రేణులు సమన్వయంతో పనిచేసి ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.


