● గ్రామంలో 12 రోజుల పాటు శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తారు.
● ఈ నెల 22న సాయంత్రం దాసుడు ఇంటి నుంచి దేవరతో బయలుదేరుతారు. టక్కురాణి అమ్మవారికి పూజలు చేసి జెండా ఆవిష్కరణతో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు వచ్చే నెల 02న జరిగే రావణ సంహారంతో ముగియనున్నాయి. దాదాపుగా 12 రోజుల పాటు సందడిగా జరిగే ఈ ఉత్సవాలు మొదటి రోజున అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తూ నైవేద్యాలు సమర్పిస్తారు. మరసటి రోజు చిన్న పండగ నిర్వహించి పగటి వేషాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారు. 2న పెద్ద పండగ నిర్వహించి అమ్మవార్లకు చల్లదనం, మొక్కులు తీర్చుకుంటారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం శ్రీరామనవమి (ఈ నెల 27)న నాడు ముందుగా గ్రామ దేవత బృందావతి అమ్మవారి ఆలయం వద్ద జెండాను ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేస్తారు. రామాలయం వద్ద మరో జెండాను ఆవిష్కరించి వేదమంత్రోచ్ఛారణల మధ్య సీతారాములు కల్యాణం నిర్వహిస్తారు. తర్వాత రోజు నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. యువకులు డ్యాన్స్‌లు, పగటి వేషాలతో అలరిస్తారు. కర్రసాము, గారడీ, పాండురంగ, రామ నాటకం, రామయ్య పట్టాభిషేకం, కోయి డాన్స్, రావణ దాహనం తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలు ముగిస్తారు.


