నరసన్నపేట: శ్రీకాకుళం నక్సల్బరీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అమరవీరుడు మామిడి అప్పలసూరి అని సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అన్నారు. కోమర్తిలో అమరవీరుల స్థూపం వద్ద 21న కోమర్తిలో 29 వ వర్ధంతి సభ నిర్వహిస్తున్నామని, దీన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కోమర్తిలో గురువారం ఉదయం ఈ మేరకు కరపత్రాన్ని ఆవిష్కరిస్తూ గ్రామంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పలసూరి చూపించిన పోరాట మార్గాన్ని అనుసరించి నూతన ప్రజాస్వామిక విప్లవ సాధన కోసం ప్రజలంతా సంఘటితం కావాలని పిలుపు నిచ్చారు. సమస్యల పరి ష్కారానికి పోరాటమే సరైన మార్గమని అన్నారు. 21న ఉదయం 10 గంటల నుంచి కోమర్తిలో వర్ధంతి సభ నిర్వహిస్తామని పార్టీ కార్యకర్తలు, అప్పలసూరి అభిమానులు, కోమర్తి ప్రజలు అదిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనసెట్టి రాజశేఖర్, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకురాలు సవలాపురం కృష్ణవేణి, న్యూ డెమొక్రసీ జిల్లా నాయకులు నేతింటి నీలం రాజు, ఏఐకెఎంఎస్ జిల్లా నాయకులు బగ్గు భాస్కరరావు, కోమర్తి కాలనీ వాసులు కొల్లి చిన్నబాబు, పెదలాపు దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు.


