● మంత్రి అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం రూరల్: రాష్ట్రంలో 12.70 లక్షల మంది దివ్యాంగులకు దివ్యాంగ శక్తి పథకం (ఉచిత బస్సు ప్రయాణం) కింద లబ్ధి చేకూరనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలియజేశారు. బుధవారం ఆయన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్‌లతో కలిసి శ్రీకాకుళంలోని రాగోలు వద్ద దివ్యాంగ శక్తి పథకాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాగోలు నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకూ బస్సులో దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 175 నియోజకవర్గాల్లో ఉచిత బస్సు సర్వీసును ప్రారంభించినట్లు చెప్పారు. దివ్యాంగులకు ఉన్న శాతాన్ని బట్టి పెన్షన్‌ను అర్హులందరికీ అందిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. జిల్లాలో 32 వేల మందికి దివ్యాంగుల పెన్షన్‌ను అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ప్రజారవాణాశాఖాధికారి సీహెచ్ అప్పలనారాయణ, రాష్ట్ర ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ డైరక్టర్ పీఎంజేబాబు పాల్గొన్నారు.


