ఐఐటీ మద్రాస్‌తో ఆదర్శ పాఠశాల ఒప్పందం | - | Sakshi
Sakshi News home page

ఐఐటీ మద్రాస్‌తో ఆదర్శ పాఠశాల ఒప్పందం

Mar 19 2026 7:33 AM | Updated on Mar 19 2026 7:33 AM

ణస్థలం: మండలంలోని కొండములగాం ఆదర్శ పాఠశాల విద్యా ప్రమాణాల ఉన్నతీకరణలో భాగంగా ప్రతిష్టాత్మక ఐఐటీ మద్రాస్‌తో స్కూల్‌ కనెక్ట్‌ అనే ప్రొగ్రాం ద్వారా ఆన్‌లైన్‌ కోర్సులను అందించేందుకు ఒప్పందం జరిగిందని ప్రిన్సిపాల్‌ పొట్నూర్‌ శ్రీధర్‌ తెలిపారు. మండలంలోని విద్యార్థులు ఇంటర్‌లో అడ్మిషన్‌ తీసుకోవడం ద్వారా ఈ గొప్ప అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

పదో తరగతి పరీక్షకు

87 మంది గైర్హాజరు

శ్రీకాకుళం: జిల్లాలో బుధవారం జరిగిన పదో తరగతి హిందీ పరీక్షకు 87 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 28,539 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 28,452 మంది పరీక్ష రాశారు. 145 కేంద్రాల్లో పరీక్ష జరగగా, డీఈఓ ఏడు కేంద్రాలను, జిల్లా పరిశీలకులు ఆరు కేంద్రాలను పరిశీలించారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ 9 కేంద్రాలను, సిట్టింగ్‌ స్క్వాడ్‌ 47 కేంద్రాల్లో తనిఖీలు జరిపాయి. ఇది ఎలా ఉంటే తొమ్మిది కేంద్రాల్లో జరిగిన ఓపెన్‌ స్కూల్‌ 10వ తరగతి పరీక్షలకు 82 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 591 మంది విద్యార్థులకు గాను 509 మంది పరీక్ష రాసినట్లు డీఈఓ రవిబాబు చెప్పారు.

భూములు ఇచ్చేది లేదు

టెక్కలి: పోర్టు ఆధారిత పరిశ్రమలకు తమ భూములు ఇచ్చేది లేదంటూ టెక్కలి మండలం పాతనౌపడ గ్రామంలో రైతులు, గ్రామస్తులు బుధవారం రాత్రి నిరసన తెలిపారు. ‘రైతుల భూము లు కార్పొరేట్లకు కట్టబెట్టవద్దు, పోర్టు ఆధారిత పరిశ్రమలకు భూములు ఇచ్చేది లేదు, ప్రాణాలైనా అర్పిస్తాం–భూములను కాపాడుకుంటాం’ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అప్పలరెడ్డి, సర్పంచ్‌ ప్రతినిధి డి.లోకేశ్వర్‌రెడ్డి, రామా రావు, యోగితో పాటు రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement