అమర జీవి పొట్టి శ్రీరాములుకు వైఎస్సార్‌సీపీ నాయకులు సోమవారం ఘనంగా నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నరసన్నపేటలో నిర్వహించిన కార్యక్రమంలో
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు నిస్వార్థ దేశ భక్తుడని కొనియాడారు. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు చరిత్రను కొత్త తరానికి తెలియజేయాలన్నారు. – శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)


