శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం మ్యూజిక్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం బాపూజీ కళామందిర్‌లో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా త్యాగయ్య చిత్రపటంతో నగరంలో తిరువీధి నిర్వహిస్తూ గీతాలను ఆలపించారు.
అనంతరం త్యాగయ్య పాడిన పంచరత్న కీర్తనలను కళాకారులు బృందం చక్కగా ఆలపించారు. ఉదయం నుంచి రాత్రి వరకు కళామందిర్ త్యాగయ్య గీతాలతో మారుమోగింది. సుమారుగా 39 మంది గాయకులు త్యాగయ్య గీతాలతో ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, డాక్టర్ కె.సుధీర్, గౌరవాధ్యక్షురాలు డాక్టర్ మాలతి, వ్యవస్థాపకలు మావూడూరి సత్యనారాయణ శర్మ, మండా శ్రీనివాసరావు, మండాకామేశ్వరరావు, జె.వెంకటేశ్వరరావు, మార్గదర్శి శ్రీను, జె.జె.మోహన్‌రావు, భాస్కర్‌భట్ల శ్రీరామ్మూర్తిశర్మ పాల్గొన్నారు.


