శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి బాక్సింగ్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఆదివారం జిల్లాస్థాయి జూనియర్స్, యూత్ బాలబాలికల బాక్సింగ్ ఎంపిక పోటీలు జరిగాయి. 60 మంది బాలబాలికలు హాజరై ప్రతిభ నిరూపించుకున్నారు. ఎంపికై న క్రీడాకారుల జాబితాను జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బలగ అనంతలక్ష్మణ్ దేవ్ (అను) సాయంత్రం వెల్లడించారు.
ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు విశాఖపట్నంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం వేదికగా జరిగే ఏపీ రాష్ట్రస్థాయి బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ సంయుక్త కార్యదర్శి వంగా మహేష్, కోచ్ ఉమామహేశ్వరరావు, భీమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ సంజీవరావు, రాజీవ్, సంఘ ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.
ఎంపికై న క్రీడాకారులు వీరే..
యూత్ విభాగంలో ఎస్.రోహిత్, ఎం.సూర్యారావు, ఎం.స్వరూప్, ఎస్.దేవివిశ్వప్రసాద్, ఎ.చరణ్ కుమార్, ఎస్.కలీంబన్ని, పి.గణేష్, జి.సత్య భార్గవ, జి.శ్రీవిద్య ఎంపికయ్యారు. జూనియర్ విభాగంలో ఎస్.కార్తీక్, ఎన్.దుర్గ ప్రసాద్, ఎం.సూర్య ప్రకాష్, పి.కృష్ణమోహన్, ఎ.రామచంద్రా రెడ్డి, టి.గణేష్ ఎంపికై నవారిలో ఉన్నారు.


