గార: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం వత్సవలస రాజమ్మ తల్లి (రాజరాజేశ్వరి) దర్శనానికి ఏడో ఆదివారం కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దూరప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులతో సహా తరలివచ్చి రాజమ్మ తల్లికి మొక్కలు తీర్చుకున్నారు. శనివారం రాత్రికే వచ్చిన భక్తులు సమీప తోటలు, ఆరుబయట బసచేసి రాజరాజేశ్వరి (రాజమ్మతల్లి) పాటు భూలోకమ్మ తల్లికి ఆదివారం ఉదయం మొక్కులు తీర్చుకున్నారు. వేకువ జామున నుంచే సమీపంలోని సముద్రంలో పవిత్ర స్నానాలాచరించారు. ఎస్‌ఐ చోడిపల్లి గంగరాజు, మైరెన్ సీఐ బూర ప్రసాదరావులు బందోబస్తు చర్యలు చేపట్టారు.


