రక్తదాతలే ప్రాణదాతలు | - | Sakshi
Sakshi News home page

రక్తదాతలే ప్రాణదాతలు

Mar 16 2026 7:20 AM | Updated on Mar 16 2026 7:20 AM

రణస్థలం: ఆపత్కాలంలో అత్యవసరమైన రక్తాన్ని దానం చేసిన వారంతా ప్రాణదాతలేనని ఇడదాసుల విద్యా, ఆరోగ్య ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఇ.తిరుపతిరాజు అన్నారు. రణస్థలం మండల కేంద్రంలోని సూర్య ఆస్పత్రి ఆవరణలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. మండు వేసవిని సైతం లెక్క చేయకుండా 77 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. దేరసాం గ్రామానికి చెందిన లుకలాపు అప్పారావు 50వ సారి రక్తదానం చేయడం విశేషం. సేకరించిన రక్తాన్ని న్యూ శ్రీకాకుళం బ్లడ్‌ బ్యాంక్‌కు అందజేశారు. కార్యక్రమంలో వైద్యులు ఇడదాసుల యశ్వంత్‌, రణస్థలం వైస్‌ ఎంపీపీ రాయపురెడ్డి భుజంగరావు, జె.ఆర్‌.పురం సర్పంచ్‌ బవిరి రమణ, ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి రమేష్‌, గుమడాం ఎంపీటీసీ జగ్గురోతు తవిటినాయుడు, సభ్యులు పిన్నింటి సత్యంనాయుడు, టేకి బ్రహ్మాజీ, గొర్లె స్వామినాయుడు, ముళ్లు రాంబాబు, మహంతి నీలాకృష్ణ, న్యూ బ్లండ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ తొత్తడి మణికంఠ, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement