మహిళలు స్వతంత్ర భావాలు కలిగి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు స్వతంత్ర భావాలు కలిగి ఉండాలి

Mar 15 2026 1:30 AM | Updated on Mar 15 2026 1:30 AM

శ్రీకాకుళం: సమాజంలో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందని, ఇందులో మార్పు రావాలంటే మహిళా ఉపాధ్యాయులే కీలకపాత్ర పోషించాలని యూటీఎఫ్‌ జిల్లా సహాధ్యక్షురాలు బి.ధనలక్ష్మి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ ఆడిటోరియంలో యూటీఎఫ్‌ జిల్లా మహిళా చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భావితరాల ఉజ్వల భవిష్యత్తుకు, మహిళల హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ ముందుండి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 5వ పూర్వ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ స్వతంత్ర భావాలు కలిగి ఉండి ప్రశ్నించే తత్వాన్ని మహిళలు అలవర్చుకోవాలన్నారు. ఎస్‌టీఎఫ్‌ఐ జాతీయ కార్యదర్శి అరుణకుమారి మాట్లాడుతూ మహిళల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, కార్యదర్శి ఎస్‌.కిషోర్‌కుమార్‌, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్‌, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాబూరావు, బమ్మిడి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ మహిళా సమస్యల పరిష్కారానికి సంఘం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సాహిత్య సాంస్కృతిక క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.

కార్యక్రమంలో సంఘం నాయకులు వాగ్దేవి, చౌదరి రవీంద్ర, తవిటమ్మ, కోదండరావు, శారద, దమయంతి, శాంతి ప్రియ, ఎండ ఉమామహేశ్వరరావు, కోరాడ వైకుంఠరావు, సూర్య ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement